Home » బాలయ్య ‘భగవంత్ కేసరి’ స్ట్రీమింగ్ హక్కులను ఆ ఓటీటీ సంస్థనే దక్కించుకుందా ?

బాలయ్య ‘భగవంత్ కేసరి’ స్ట్రీమింగ్ హక్కులను ఆ ఓటీటీ సంస్థనే దక్కించుకుందా ?

by Anji
Ad

నందమూరి నటసింహం,గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ గురించి తెలియని వారుండరు. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇటీవలే వీరసింహారెడ్డి, అఖండ సినిమాలు విజయం సాధించడంతో మంచి ఫామ్ లో ఉన్నారు బాలయ్య. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. బాలకృష్ణ పుట్టిన రోజు కానుకగా ఈ సినిమాకు ‘భగవంత్ కేసరి’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని కూడా అనిల్ రావిపూడి విడుదల చేయడంతో భారీ రెస్పాన్స్ వచ్చింది. 

Advertisement

ఈ టీజర్ చూసిన తరువాత అభిమానులు బాలయ్యకి మరో భారీ హిట్ గ్యారెంటీ అని భావిస్తున్నారు. వీరసింహారెడ్డి హిట్ తరువాత బాలయ్య సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ బయటికి వచ్చింది. ఈ సినిమా ఓటీటీ హక్కుల గురించి ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఓటీటీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ దక్కించుకున్నట్టు సమాచారం. అమెజాన్ ప్రైమ్ వీడియో భగవంత్ కేసరి ఓటీటీ హక్కులను సొంతం చేసుకుందని తెలుస్తుంది.

Advertisement

త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ మూవీలో బాలయ్య కి జోడిగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. బాలయ్యకు కూతురుగా శ్రీలీల నటిస్తుంది. అదేవిధంగా ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ నటిస్తుండగా.. ఈ మూవీని సన్ షైన్ స్క్రీన్ బ్యానర్ వారు నిర్మిస్తున్నట్టు సమాచారం. ఈ మూవీని దసరా కానుకగా ప్రేక్షకులముందుకు తీసుకురాబోతున్నారు. దీంతో శరవేగంగా షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించి ప్రమోషన్స్ ప్రారంభించాలని ప్లాన్ వేశారు మేకర్స్. అనిల్ రావిపూడి బాలయ్యకి భారీ హిట్ ఇస్తాడని అభిమానులు ఆశపడుతున్నారు. భగవంత్ కేసరి మూవీ హిట్ అవుతుందో లేదో వేచి చూడాలి మరి. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ గురించి వేణుస్వామి ఆసక్తికర కామెంట్స్..!

 నిహారిక కారణంగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి తమ కోరిక తీర్చుకోలేకపోతున్నారా ?

 

Visitors Are Also Reading