సినీ ఇండస్ట్రీలో హిట్‌లు, ఫ్లాప్‌లు సర్వసాధారణం. కొందరు హీరోలు ఒక్క సినిమా ఫ్లాప్ కాకుండా జాగ్రత్త పడి సినిమాలు తీస్తుంటారు. మరికొందరూ హీరోలు తీసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అవ్వడం, కొన్ని సినిమాలు హిట్ అవ్వడం ఇలా ఒక్కొక్కరి కెరీర్‌లో ఒక్కొక్క విధంగా జరుగుతుంటాయి. ఇక బాలకృష్ణ సినీ కెరీర్ ఒకసారి చూసినట్టయితే ముఖ్యంగా డిజాస్టర్ సినిమాల్లో పరమవీరచక్ర ఒకటి. దాసరినారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం భారీ అంచనాలతో విడుదలై మార్నింగ్ షోకే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.
ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలున్నప్పటికీ రొటిన్ కథ, కథనంతో తెరకెక్కడంతో ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక సింహా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత బాలయ్య ఈ సినిమాతో ప్రేక్షకులను తీవ్ర నిరాశపరిచారనే చెప్పాలి. ముఖ్యంగా ఈ సినిమా శాటిలైట్ హక్కులను కూడా ఏ ఛానల్ కొనుగోలు చేయలేదంటే ఈ చిత్రం ఎంత ఫ్లాప్ అయిందో అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన సి.కల్యాణ్ మాత్రం తనకు ఈ సినిమా లాభాలను అందించిందని వెల్లడించడం విశేషం. డిస్ట్రిబ్యూటర్లకు ఈ సినిమా నష్టాలను అందించలేదు అని కామెంట్ చేసారు. తక్కువ బడ్జెట్‌తోనే సినిమా నిర్మించడం వల్ల డిజాస్టర్ టాక్ వినిపించినా పెద్దగా నష్టం రాలేదని తెలుస్తోంది.
Advertisement
Advertisement
అదేవిధంగా బాలకృష్ణ కూడా కొంత వరకు రెమ్యునరేషన్ త్యాగం చేసి ఉండవచ్చని కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. యూట్యూబ్‌లో పరమవీరచక్ర సినిమా అందుబాటులో ఉన్నప్పటికీ ఈ చిత్రాన్ని వీక్షించేందుకు ఆసక్తి చూపిస్తున్న ప్రేక్షకుల సంఖ్య చాలా తక్కువగా ఉండడం గమనార్హం. ఇక ఆ తరువాత బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన లెజెండ్ సినిమాతో మంచి సక్సెస్ సాధించారు. గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా హిట్ తరువాత అఖండనే బాలయ్య కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా బోయపాటి శ్రీను-బాలయ్య కాంబోలో వచ్చిన మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కావడం విశేషం. మొత్తానికి బాలయ్య సినిమా ఫ్లాప్ అయినా కానీ నిర్మాతలకు నష్టం రాకుండా చూస్తారనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది.
Also Read :
మహేష్ సర్కారు వారి పాట ట్రైలర్ విడుదల.. ఎలా ఉందంటే..?
జనసేన మేనిఫెస్టోతో పెళ్లి ప్రతిక.. సోషల్ మీడియాలో వైరల్..!