Home » బాలయ్య-అనిల్ రావిపూడి సినిమా వచ్చేది అప్పుడేనా ?

బాలయ్య-అనిల్ రావిపూడి సినిమా వచ్చేది అప్పుడేనా ?

by Anji
Ad

నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు రాజకీయాల్లో,  అడప దడపా ఆహాలో స్ట్రీమింగ్ అయ్యే అన్ స్టాపబుల్ టాక్ షోలో హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఐపీఎల్ 16వ సీజన్ మ్యాచ్ లకు వ్యాఖ్యాత గా కూడా వ్యవహరించనున్నారట బాలయ్య. ఇటీవలే వీరసింహారెడ్డి సినిమాతో సంక్రాంతి పండుగకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతంగా బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘NBK108’ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. 

Also Read :  దుబాయ్ శ్రీనులో ఎంఎస్ పాత్ర కోసం శ్రీనువైట్ల ఆ స్టార్ హీరోను ఇమిటేట్ చేశాడా..?

Advertisement

Advertisement

ఇందులో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమాలో కాజల్ తో పాటు మరో కీలక పాత్రలో యంగ్ బ్యూటీ శ్రీలీల కూడా నటిస్తోంది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరిష్ పెద్ది ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు బాలయ్య కనిపించని పాత్రలో ఇందులో కనిపించనున్నారట. బాలయ్య మార్క్ మాస్ యాక్షన్ తో పాటు అనిల్ రావిపూడి తాలూకు కామెడీ ఎలిమెంట్స్ ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఇటీవలే ఉగాది పండుగ రోజున ఈ చిత్రానికి సంబంధించినటువంటి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. 

Also Read :  ‘దసరా’ చిత్రం మొదటి రోజు కలెక్షన్లు ఇవే..!

Manam News

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో అప్డేట్ విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ చిత్రాన్ని ఈ సంవత్సరం దసరా పండుగకు విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ‘విజయదశమికి ఆయుధ పూజ’ అని తాజాగా ఓ పోస్టర్ విడుదల చేసింది. సంక్రాంతి పండుగకు వీరసింహారెడ్డి సినిమాతో విజయం సాధించిన బాలయ్య మళ్లీ ఈ ఏడాది దసరాకి రాబోతున్నాడు. దసరా సమరంలో బాలయ్య-అనిల్ రావిపూడి సినిమా విజయం సాధిస్తుందో వేచి చూడాలి మరి. 

Also Read :  సల్మాన్ ఖాన్ సినిమాలో బతుకమ్మ పాట.. ఆ హీరో సలహా మేరకేనా?

Visitors Are Also Reading