Home » బాలయ్య “అఖండ” ట్విట్టర్ రివ్యూ…!

బాలయ్య “అఖండ” ట్విట్టర్ రివ్యూ…!

by AJAY
Ad

Akhanda Movie Review & Rating: అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న బాలయ్య అఖండ సినిమా ఈరోజు థియేటర్ లో విడుదలైంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత భారీ బడ్జెట్ లో వచ్చిన మాస్ సినిమా కావడం తో థియేటర్ల వద్ద ప్రేక్షకులు క్యూ కడుతున్నారు. బాలయ్య బోయపాటి కాబోలో సినిమా కావడంతో బాలయ్య అభిమానుల తో పాటు ప్రతి ప్రేక్షకుడు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చేశారు. ఇక ఈ సినిమా ట్విట్టర్ రివ్యూ చూస్తే.. సర్వత్ర పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అంతేకాకుండా సినిమా మొత్తం మాస్ యాక్షన్ తో నిండిపోయింది. బాలయ్య బోయపాటి కాంబినేషన్ అంటే అభిమానులు ప్రేక్షకులు ఏమి ఆశిస్తారో అదే ఈ సినిమాలో చూపించారు.

Also Read: మా అసోసియేష‌న్ విజ‌యశాంతిని ఎందుకు బ్యాన్ చేసిందో తెలుసా..?

Advertisement

Advertisement

Balayya akhanda movie review

సినిమాలో బాలయ్య తన నటనతో ఆకట్టుకున్నారు. అఘోరా లాంటి క్యారెక్టర్ లో బాలయ్య అద్భుతంగా నటించారు. ఇక ఈ సినిమాకు తమన్ ఇచ్చిన మ్యూజిక్ మరింత హైలైట్ గా నిలిచింది. బాలయ్య యాక్షన్ కు తమన్ మ్యూజిక్ కు థియేటర్లు దద్దరిల్లి పోతున్నాయి. సినిమాలో మాస్ ఫైట్ సన్నివేశాలు హైలెట్ గా నిలిచాయి. అయితే ఈ సినిమా కు ఫస్ట్ హాఫ్ కాస్త లెంతీగా ఉండటం బోరింగ్ గా అనిపిస్తుంది. అంతే కాకుండా సినిమా కథ కూడా ముందుగానే ఊహించే విధంగా ఉండటం కూడా సినిమాకు మైనస్ గా నిలిచింది. అయితే బాలయ్య నుండి అభిమానులు ప్రేక్షకులు ఆశించే సీన్లు ఉండటం సినిమా వినోదాత్మకంగా ఉండటంతో మాస్ హిట్ అంటూ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

Also Read: LAKSHYA TRILER : పడిలేచిన వాడితో పందెం ప్రమాదకరం…!

Visitors Are Also Reading