Home » LAKSHYA TRILER : పడిలేచిన వాడితో పందెం ప్రమాదకరం…!

LAKSHYA TRILER : పడిలేచిన వాడితో పందెం ప్రమాదకరం…!

by AJAY
Ad

టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం లక్ష్య. ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా చిత్ర యూనిట్ విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా విడుదల చేసింది. ఇప్పటికే ఈ సినిమా టీజర్ మరియు లిరికల్ వీడియోలకు భారీ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా విడుదల చేసిన ట్రైలర్ సైతం ఆకట్టుకునే విధంగా కనిపిస్తోంది. ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమా ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కినట్టు కనిపిస్తోంది. అదే విధంగా లవ్ ఎమోషనల్ డ్రామా కూడా ఉన్నట్టు అర్థం అవుతోంది. ఈ సినిమాలో నాగశౌర్య విలువిద్య కళాకారుడిగా కనిపిస్తున్నాడు.

Advertisement

Lakshya trailer

Lakshya trailer

ఈ నేపథ్యంలో అతడు ఎలా విజయం సాధిస్తాడు అనేది సినిమాలో ఆసక్తికరంగా చూపించబోతున్నాడు. ట్రైలర్ లో వస్తున్న బ్యాగ్రౌండ్ స్కోర్ మరియు డైలాగులు కూడా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఇక ఈ ట్రైలర్ లో నాగశౌర్య రకరకాల లుక్స్ లో కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో నాగశౌర్య యైట్ ప్యాక్ బాడీతో జుట్టు గడ్డం పెంచుకుని కనిపిస్తున్నాడు. మరోవైపు లవర్ బాయ్ లుక్ లోనూ కనిపిస్తున్నాడు. అంతే కాకుండా ఈ సినిమా కోసం నాగహౌర్య విలువిద్యలో స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నాడు. ఇక ఈ చిత్రంలో నాగశౌర్య సరసన కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. అంతే కాకుండా కాల భైరవ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు. మరి లక్ష్య సినిమాతో వస్తున్న నాగశౌర్య అనుకున్న లక్ష్యం సాధిస్తాడో లేదో చూడాలి.

Advertisement

 

 

Visitors Are Also Reading