Home » అడివి శేష్ హిట్ 2 టీజర్ పై యూట్యూబ్ కాంట్రవర్సీ.. అసలు ఏం జరిగింది ?

అడివి శేష్ హిట్ 2 టీజర్ పై యూట్యూబ్ కాంట్రవర్సీ.. అసలు ఏం జరిగింది ?

by Anji
Ad

అడివి శేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.   ఇటీవలే ఆయన మేజర్ సినిమాతో సూపర్  హిట్ సాధించి మంచి ఫామ్ లో ఉన్నాడు.  తొలుత కాస్త తడబడ్డ ఆ తర్వాత తనను తాను మార్చుకుని, స్వయంగా తన సినిమాలను తానే రాసుకుంటూ, వరుసగా హిట్ లను అందుకుంటున్నాడు అడివి శేష్.  తెలుగు, హిందీ, మలయాళీ భాషల్లో మొదలై మంచి లాభాలను తెచ్చింది. ప్రస్తుతం ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది.  ఇదిలా ఉంటే.. అడివి శేష్ హీరోగా వస్తున్న లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ హిట్ 2 శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. మొదటి హిట్ సినిమాలో విశ్వక్  సేన్ నటించగా.. సీక్వెల్ లో శేష్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటోంది. అయితే ఈ సినిమా ప్రమోషన్ లో టీజర్ విడుదలైంది.  తాజాగా విడుదలైన టీజర్ మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంటుంది. శేష్ ఈ సినిమా మొదటగా పెద్దగా పట్టింపు లేని ఆఫీసర్ గా కనిపిస్తున్నారు.

Advertisement

వెర్సటైల్ రోల్స్ చేస్తూ తనదైన గుర్తింపు, క్రేజ్ ను సంపాదించుకుంటున్న టాలెంటెడ్ యాక్టర్ అడవి శేష్ లేటెస్ట్ మూవీ హిట్ 2 డిసెంబర్ 2న సినిమా రిలీజ్ కి సిద్ధమవుతుంది. శైలేష్ కొలను దర్శకత్వంలో నాని సమర్పకుడిగా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ప్రశాంతి త్రిపురనేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది.  ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషనల్ వర్క్ శరవేగంగా జరుపుకుంటోంది.   అతి తక్కువ వ్యవధిలోని యూట్యూబ్ సహా అన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో హిట్ 2 టీజర్ హల్ చల్ చేస్తూ ట్రెండ్ అయింది. ఈ టీజర్ తో సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి. అయితే యూట్యూబ్ హిట్ 2 టీజర్ ను తొలగించి అందరికీ షాక్ ఇచ్చింది. ట్రెండింగ్ లిస్టు నుంచి ఈ టీజర్ ని తొలగించింది. టీజర్ చూడడానికి వయోపరిమితి ఉండాలంటూ ఆంక్షలు విధించింది. టీజర్ పై యూట్యూబ్ యాక్షన్ తీసుకునే లోపు 9 మిలియన్ కి పైగా వ్యూస్ రావడం విశేషం.  తాజాగా హీరో అడివి శేష్ వివరణ ఇస్తూ.. ఓ వీడియోను విడుదల చేశారు.

Advertisement

Also Read :  ఒంట‌రి జీవిత‌మే స‌మంత‌కు శాప‌మా..? జాత‌కం వ‌ల్ల‌నే క‌ష్టాలా ?

టీజ‌ర్ చూడ‌డానికి వ‌యోప‌రిమితి ఉండాలంటూ యూ ట్యూబ్ ఆంక్ష‌ల‌ను విధించింది. టీజర్ ఓపెన్ చేస్తే సైన్ ఇన్ చేయాలని చూపిస్తుంది. సైన్ ఇన్ చేస్తేనే ఈ వీడియో చూడొచ్చు. ఇలాంటిది ముందే జరుగుతుందని టీమ్ ముందుగానే ఊహించింది. . యూట్యూబ్ నిర్ణయాన్ని చిత్ర యూనిట్ స్వాగతించింది. అదే సమయంలో అడివి శేష్ తన వీడియోలో రేపు విడుదలవుతున్న ఉరికే ఉరికే సాంగ్ ను చూసి ఎంజాయ్ చేయాలని కోరారు.   ఇక ఈ సెకండ్ పార్ట్ లో మరింతగా యాక్షన్, డ్రామా, థ్రిల్లింగ్ సీన్స్ ఉంటాయని అంటున్నారు దర్శకుడు. ఈ మూవీని ప్రశాంతి త్రిపురనేని, హీరో నానిలు కలిసి నిర్మిస్తున్నారు. హిట్ 1 తెలంగాణ నేపథ్యంగా సాగగా.. హిట్ 2 ఏపీ నేపథ్యంగా సాగనుంది.  మరో పాత్రలో కొత్త హీరోయిన్ కోమలీ ప్రసాద్ కూడా కనిపించనుంది.

Also Read :  భైర‌వ‌ద్వీపం సినిమా విడుద‌ల స‌మ‌యంలో అంత ర‌చ్చ జ‌రిగిందా..? ఏకంగా సెన్సార్ వాళ్లు వార్నింగ్ ఇచ్చినా.?

Visitors Are Also Reading