నందమూరి నటసింహం , గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రానికి మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ లభించాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో దాదాపు ప్రతి థియేటర్ లో వీరసింహారెడ్డి సినిమానే నడిచింది. ఇక అమెరికాలో కూడా ఈ చిత్రం భారీ స్థాయిలో విడుదల అయింది. తొలిరోజు బాలయ్య సినిమా వసూళ్ల మోత మోగించింది. బాలయ్య చివరి సినిమా అఖండ చిత్రం కంటే వీరసింహారెడ్డి పస్ట్ డే కలెక్షన్లు ఎక్కువగా వసూలు చేసింది.
Advertisement
ఇక ఈ విషయంలో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇదే జోరు కొనసాగిస్తే.. టోటల్ కలెక్షన్లలో కూడా బాలయ్య సరికొత్త ట్రెండ్ సృష్టిస్తారని అభిమానులు భావించారు. కానీ రెండో రోజు నుంచి వీరసింహారెడ్డి జోరు కాస్త తగ్గిందనే చెప్పాలి. వాల్తేరు వీరయ్య సినిమా కోసం కోసం వీరసింహారెడ్డి ఆడుతున్న కొన్ని థియేటర్ల నుంచి సినిమాను తీసేశారు. ఇక ఆ తరువాత రోజు వారసుడు కోసం దిల్ రాజు మరిన్ని థియేటర్లను తీసేసుకున్నారు. మరికొన్ని కళ్యాణం కమనీయం సినిమా కోసం వెళ్లిపోయాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. ప్రపంచ వ్యాప్తంగా రెండో రోజు నుంచే వీరసింహారెడ్డి వసూళ్లలో భారీ కోత పడింది.
Advertisement
Also Read : ఆ సినిమా కోసం బాలకృష్ణకు 3 కండీషన్స్ పెట్టిన NTR !
దీంతో బాలయ్య అభిమానులు అంచనాలన్నీ తలకిందులయ్యాయి. మంచి స్క్రీన్స్ ఉన్నటువంటి చోట కలెక్షన్లు బాగానే వస్తున్నాయి. కానీ మిగిలిన చోట్ల మాత్రం అండర్ పెర్పార్మ్ చేస్తోంది. మరోవైపు వాల్తేరు వీరయ్య వసూళ్లు కాస్త పర్వాలేదనిపిస్తూ ఉన్నాయి. సంక్రాంతి పండుగ అడ్వాంటేజ్ ని వాల్తేరు వీరయ్య బాగా వినియోగించుకుంటుంది. టాక్ పరంగా రెండు సినిమాలకు పెద్దగా తేడా లేకపోయినా.. చిరంజీవి సినిమానే పై చేయి సాధిస్తుండడం బాలయ్య అభిమానులకు నచ్చడం లేదు. రెండు సినిమాలను నిర్మించింది మైత్రీ మూవీ మేకర్స్ వారే అయినప్పటికీ థియేటర్ల కేటాయింపు విషయంలో బాలయ్య సినిమాకు అన్యాయం చేస్తోందని.. థియేటర్లు ఇవ్వలేదని.. ఇలా పక్షపాతం చూపించడం ఏంటంటూ మైత్రీ మూవీస్ నిర్మాతలపై బాలకృష్ణ అభిమానులు మండిపడుతున్నారు.
Also Read : ANR మద్రాసు నుంచి హైదరాబాద్ కి చిత్రపరిశ్రమను తీసుకెళదాం అంటే ఎన్టీఆర్ విభేదించారట ఎందుకంటే ?