వెండితెరపై అందాల రాముడు.. కొంటె కృష్ణుడు.. ఏడుకొండల వాడు.. ఇలా ఏ పాత్రనైనా అవలీలగా చేస్తేనే ఆ పాత్రకు నిండుదనం వస్తుంది. రాజకీయాల్లో కూడా తనదైన ముద్రవేసిన ముఖ్యమంత్రిగా మంచి పేరు సంపాదించుకున్న మహానటుడు, నందమూరి తారకరామారావు. మే 28న ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను నిమ్మకూరులో ప్రారంభం చేసి ఏడాది మొత్తం నిర్వహించనున్నారు. నందమూరి బాలకృష్ణ తండ్రి ఎన్టీఆర్ జయంతి వేడుకలను నిమ్మకూరులో ప్రారంభిస్తారు. ఈ శతజయంతి వేడుకల్లో చిత్రసీమతో పాటు డ్రామా ఆర్టిస్టులను కూడా సత్కరించనున్నారు.
ఇక ఎన్టీఆర్ టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్‌వన్ హీరోగా కొనసాగుతూనే.. రాజకీయాల్లోకి ప్రవేశించి కేవలం 9 నెలల వ్యవధిలో సీఎం అయి రికార్డు క్రియేట్ చేశారుఎన్టీఆర్. అన్నగారి నట వారససుడిగా సినీ ఇండస్ట్రీలో బాలకృష్ణ తండ్రికి తగ్గ తనయుడిగా అగ్రహీరోగా రాణిస్తున్నారు. ఎన్టీఆర్ విషయానికొస్తే.. కేవలం నటుడిగానే కాకుండా దర్శకునిగా, నిర్మాతగా స్టూడియో అదినేతగా, రాజకీయ వేత్తగా, సీఎంగా ఎవరికి సాధ్యం కానీ రికార్డులను సృష్టించిన బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగు ప్రజలందరి చేత అన్నా అని పిలిపించుకున్నా మహానటుడు ఎన్టీఆర్.
Advertisement
Advertisement
నాటకాలతో మంచి నటుడిగా గుర్తింపు పొందిన రామారావును గుర్తించిన నిర్మాత బీ.ఏ. సుబ్బారావు పల్లెటూరి పిల్ల చిత్రంలో అవకాశం ఇచ్చారు. ఆ సినిమా ఆలస్యం కావడంతో ఎల్వీప్రసాద్ దర్శకత్వంలో మనదేశం సినిమాలో అవకాశం రావడంతో నటించారు. ఎన్టీఆర్ నటించిన తొలి చిత్రం మనదేశం అయింది. 1949లో వచ్చి ఆ సినిమాలో ఓ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌పాత్రలో నటించారు. 1950లో పల్లెటూరి పిల్ల విడుదల అయింది. ఇక బాలకృష్ణ తండ్రితో కలిసి దాదాపు 10 చిత్రాల్లో నటించారు. ఎన్టీఆర్ నటించిన హిట్ చిత్రాలను కూడా రీమెక్ చేయడంతో పాటు పాత టైటిల్స్‌తో సినిమాలు చేయడం విశేషం. ప్రస్తుతం బాలయ్య గోపిచంద్ మలినేని దర్శకత్వంలో 107వ సినిమాలో నటిస్తున్నారు. దీని తరువాత అనిల్ రావిపూడి, కొరటాల శివ దర్శకత్వంలో వరుసగా సినిమాలు చేయడానికి ఓకే చెప్పారు బాలయ్య.
Also Read :
సమంత -నాగచైతన్యలను నాగార్జున కలుపబోతున్నాడా..?
మోహన్ బాబు మొదటి భార్య ఎవరో తెలుసా…? ఆమె ఎలా చనిపోయారంటే…!