Home » బాల‌య్య రీమేక్ చేసిన సినిమాలేంటో మీకు తెలుసా..?

బాల‌య్య రీమేక్ చేసిన సినిమాలేంటో మీకు తెలుసా..?

by Anji
Ad

సినిమాకు భాష‌, కులం, మ‌తం, ప్రాంతం అని తేడాలు అస‌లు ఉండ‌వు అని చెబుతుంటారు. సినిమా అనేది ఓ వినోదం మాత్ర‌మేన‌ని.. దానికి భాష‌, కులాలు, ప్రాంతాలు అనే బేధాలు ఉండ‌వ‌ని సినీ సెల‌బ్రెటీలు చెబుతుంటారు. ఏ భాష సినిమాను అయినా ప్ర‌పంచంలోని ప్ర‌జ‌లంద‌రూ చూస్తున్నార‌ని, స‌బ్ టైటిల్ రూపంలో చూసి ప్ర‌తీ ఒక్క‌రూ ఆనందిస్తున్నార‌ని చెబుతున్నారు. లాక్‌డౌన్‌లో ఓటీటీ హ‌వా ఎక్కువైపోయి ప్ర‌తి సినిమాకు ఇంట‌ర్నేష‌న‌ల్ వైడ్‌గా టాక్ వినిపిస్తుంది. సినిమా న‌చ్చితే భాష‌తో సంబంధం లేకుండా అంద‌రూ చూస్తున్నారు.

Advertisement

ఈ త‌రుణంలో రీమేక్ సినిమాల ట్రెండ్ కూడా విప‌రీతంగా ఎక్కువ అయింది. ముఖ్యంగా ఇత‌ర భాష‌ల్లో హిట్ అయితే ఇక్క‌డ కూడా హిట్ అవుతుంద‌నే భావ‌న‌లో ఉన్నారు. మార్కెట్‌లో ల‌భించే రెడిమెడ్ స‌రుకుగా రీమేక్ క‌థ‌లు త‌యార‌య్యాయి. రీమెక్ సినిమాను ఎంచుకుంటే క‌థ‌, స్క్రీన్ ప్లే లాంటివి రాయాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. దీంతో ఈ మ‌ధ్య ఒక ఇండ‌స్ట్రీలో హిట్ అయిన సినిమాను వేరే భాష‌ల్లో రీమెక్ చేస్తున్నారు. ఇక నంద‌మూరి బాల‌కృష్ణ కూడా ఇత‌ర భాష‌ల్లో వ‌చ్చిన ప‌లు సినిమాల‌ను తెలుగులో రీమేక్ చేశారు.

Advertisement


హాలీవుడ్లో తెర‌కెక్కిన టోట‌ల్ రీకాల్ సినిమా తెలుగులో బాల‌య్య హీరోగా ల‌య‌న్ గా తెర‌కెక్కింది. క‌మ‌ల్ హాస‌న్ హీరోగా వ‌చ్చిన భార‌తీయుడు సినిమాను ఒక్క‌మ‌గాడుగా, హాలీవుడ్ సినిమా బౌర్నె ఐడెంటిటి, ది లాంగ్ కిస్ గుడ్ నైట్ సినిమాల‌ను తీసుకుని విజ‌యేంద్ర వ‌ర్మ‌గా రూపొందించారు. ఈ త‌మిళ సినిమా సామిని తెలుగులో ల‌క్ష్మీన‌ర‌సింహ‌గా, క‌న్న‌డ‌లో వ‌చ్చిన రాజ‌న‌ర్సింహ సినిమాను ప‌ల‌నాటి బ్ర‌హ్మ‌నాయుడుగా తెలుగులో రీమెక్ చేసారు. త‌మిళంలో సూప‌ర్ హిట్ అయిన ఎన్ తంగాచ్చి ప‌డిచావా సినిమాను తెలుగులో ముద్దుల మావ‌య్య‌గా మ‌రొక త‌మిళ సినిమా తంగ‌మ‌న రాసా సినిమాను తెలుగులో ముద్దుల మేన‌ల్లుడిగా రీమేక్ చేశారు. ఎన్టీఆర్ న‌టించిన స‌త్య‌హ‌రిచంద్ర‌, శ‌కుంత‌ల సినిమాల‌ను తీసుకుని బ్ర‌హ్మ‌ర్షి విశ్వాస‌మిత్ర‌గా తీశారు.

Also Read :

న‌య‌నతార‌పై కేసు పెట్ట‌నున్న టీటీడీ.. కార‌ణం ఏమిటో తెలుసా..?

పెళ్లికి ముందే ఆహారంలో ఈ మార్పులు చేసుకోండి.. త‌ప్ప‌కుండా ఫిట్‌నెస్ సాధిస్తారు..!

Visitors Are Also Reading