Home » న‌య‌నతార‌పై కేసు పెట్ట‌నున్న టీటీడీ.. కార‌ణం ఏమిటో తెలుసా..?

న‌య‌నతార‌పై కేసు పెట్ట‌నున్న టీటీడీ.. కార‌ణం ఏమిటో తెలుసా..?

by Anji
Ad

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం గురించి ఇక ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. అక్క‌డ పవిత్ర ఎలా ఉంటుందో ప్ర‌తి ఒక్క‌రికీ తెలిసిన విష‌యమే. సాధార‌ణ ప్ర‌జ‌లు అయినా.. సెల‌బ్రిటీలు అయినా ఎవ్వ‌రైనా ప‌విత్ర‌త‌ను పాటిస్తుంటారు. కానీ ఆ స్టార్ హీరోయిన్ న‌య‌న‌తార తిరుప‌తి మాడ వీధుల్లో చెప్పుల‌తో తిరగ‌డం విశేషం. అక్క‌డ‌క్క‌డ నాలుగు మాడ వీధుల్లో పాద‌ర‌క్ష‌ల‌తో తిర‌గ‌రాదు అని బోర్డులు కూడా ఏర్పాటు చేయ‌డం విశేషం.

Advertisement

న‌య‌న‌తార‌-విఘ్నేష్ దంప‌తుల‌కు నిన్న పెళ్లి జ‌రిగిన విష‌యం తెలిసిందే. అయితే ఇవాళ తిరుప‌తి స్వామి వారిని ద‌ర్శించుకున్నారు. వారిని చూసేందుకు అభిమానులు బారులు తీరారు. అదేవిధంగా వారు కొన్ని ఫోటోల‌కు  ఫోజులు ఇచ్చారు.  ఈ త‌రుణంలో అక్క‌డికి వ‌చ్చిన భ‌క్తులు వీరిని ఫోన్‌లో బంధించి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. కొంత మంది అయితే వీరితో సెల్పీలు కూడా దిగారు. ద‌ర్శ‌కుడు విఘ్నేష్ శివ‌న్ చెప్పులు లేకుండా మాడ వీధుల్లో తిరిగినప్ప‌టికీ హీరోయిన్ న‌య‌న‌తార మాత్రం చెప్పులతోనే ఉండ‌డం గ‌మ‌నార్హం.

Advertisement

న‌య‌న‌తార‌తో పాటు కొంత‌మంది ఫోటో గ్రాఫ‌ర్స్ కూడా చెప్పులు ధ‌రించారు. ఎంతో ప‌విత్రంగా భావించే స్థ‌లంలో ఇలా చెప్పులు వేసుకొని ఇంత స్వేచ్ఛ‌గా ఎలా తిరుగుతార‌ని ప‌లువురు నెటిజ‌న్లు ప్ర‌శ్నించారు. తిరుప‌తి మాడ వీధుల్లో చెప్పుల‌తో తిరిగిన న‌య‌న‌తార క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని కొంత‌మంది డిమాండ్ చేస్తున్నారు. మ‌రొక వైపు తిరుమ‌ల‌లో న‌య‌న‌తార‌, విఘ్నేశ్ శివ‌న్ దంప‌తుల ఫోటో షూట్‌పై టీటీడీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. మాఢ‌వీధుల్లో చెప్పుల‌తో న‌డ‌వ‌డం దుర‌దృష్ట‌క‌రం అని పేర్కొంది. వారిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేస్త‌మని.. ఎలాంటి సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు చేయ‌వ‌చ్చో ప‌రిశీలిస్తున్న‌ట్టు తెలిపింది.

Also Read : 

పెళ్లికి ముందే ఆహారంలో ఈ మార్పులు చేసుకోండి.. త‌ప్ప‌కుండా ఫిట్‌నెస్ సాధిస్తారు..!

ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాలో స‌ల్మాన్‌ఖాన్.. ఆ డైరెక్ట‌ర్ క్లారిటీ..!

Visitors Are Also Reading