ఒక్కో జెనరేషన్ లో కొంతమంది హీరోల మధ్యన పోటీ ఉంటుంది. ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కృష్ణల మధ్య పోటీ ఉండేది. ఆ తరవాత చిరంజీవి, మోహన్ బాబు, బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్ ల మధ్య పోటీ ఏర్పడింది. ఇక మోహన్ బాబు ఆ రేస్ నుండి పూర్తిగా తప్పుకోగా నలుగురు హీరోలు మాత్రం సినిమాలు చేస్తున్నారు. అయితే ఈ నలుగురిలో బాలయ్య ఒక్కడే దూసుకుపోతున్నట్టు కనిపిస్తుంది.
Also Read: చిరంజీవి కంటే ముందే గాడ్‌ఫాదర్ టైటిల్‌తో సినిమా తీసిన హీరో ఎవరో తెలుసా ?
Advertisement
చిరంజీవి టాలీవుడ్ లోనే నంబర్ వన్ స్థానంలో చాలా కాలం పాటూ కొనసాగారు. కానీ కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే చిరు రాజకీయాల్లోకి రావడంతో ఆయన సినిమా కెరీర్ పై దెబ్బ పడింది. రీఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ చిరుకు సరైన హిట్ పడటం లేదు. అంతే కాకుండా చిరంజీవి సినిమాలకు గతంలో వచ్చినట్టుగా కలెక్షన్స్ కూడా రావడం లేదు.
Advertisement
అందుకు గాడ్ ఫాదర్ సినిమానే నిదర్శనం. ఈ సినిమాకు మొదటి రోజు రూ.16 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక నాగార్జున వరుస సినిమాలు చేస్తున్నా ఆయనకు కూడా బ్లాక్ బస్టర్ లు పడటం లేదు. నాగ్ నటించిన గోస్ట్ సినిమాకు కేవలం రూ.2.42 కోట్ల షేర్ ను వసూలు చేసింది.
Also Read: సినిమాలో సరదాగా ఎన్టీఆర్ చెప్పిన మాట నిజం అయ్యింది గా ! ఇది గుర్తుందా ?
ఇక వెంకటేష్ సింగింల్ గా హీరోగా నటించిన ఏ సినిమా కూడా మొదటి రోజు రూ.10 కోట్లకు మించి షేర్ ను వసూలు చేయలేకపోయింది. ఇదిలా ఉంటే బాలయ్య హీరోగా నటించిన అఖండ సినిమా మొదటి రోజు రూ.18 కోట్లకు పైగా షేర్ ను వసూలు చేసింది. మరోవైపు ఇప్పుడు బాలయ్య వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అలా చూసుకున్నా బాలయ్య ఈ నలుగురు హీరోల్లో ఫుల్ స్వింగ్ మీద ఉన్నాడు.
Also Read: ఆ సినిమాలను సొంత బిడ్డలా ప్రేమిస్తానంటున్న మహానటి..!