Telugu News » Blog » అన్నమయ్య సినిమా వదులుకున్న ఆ హీరోలు ఎవరో మీకు తెలుసా…?

అన్నమయ్య సినిమా వదులుకున్న ఆ హీరోలు ఎవరో మీకు తెలుసా…?

by Manohar Reddy Mano
Ads
సినీ అభిమానులకు మన్మథునిగా.. లవర్ బాయ్ గా పరిచయమున్న హీరో నాగార్జున. అలాగే లివ్ సినిమాలకు హీరోయిన్స్ అందాలను చూపించడానికి పెట్టింది పేరు కే. రాఘవేంద్రరావు. అయితే వీరి కాంబినేషన్ లో వచ్చిన చాలా సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. అందులో అన్నమయ్య ఒక్కటి. అసలు ఈ సినిమా అనౌన్స్ చేయగానే సినీ అభిమానులు అందరూ షాక్. నాగార్జున ఏంటి.. రాఘవేంద్రరావు ఏంటి… భక్తి సినిమా చేయడం ఏంటి అని అనుకున్నారు. కానీ సినిమా విడుదల అయిన తర్వాత ఆలా అనుకున్నవారు ముక్కున వేలు వేసుకున్నారు.
1997 లో విడుదలైన ఈ సినిమా ఓ సంచనలం సృష్టించింది. ఇందులో నాగార్జున నటనకు ఫుల్ మార్కులు పడ్డాయి. ఇప్పుడు తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాలు బయటికి వచ్చాయి. అవేంటంటే… ఈ సినిమాను నందమూరి బాలకృష్ణ, శోభన్ బాబు ఇద్దరు వదులుకున్నారు అని తెలుస్తుంది. అయితే వారు ఈ సినిమాలో వదులుకున్నది బాగార్జున వేసిన అన్నమయ్య పాత్ర కాదు… సుమన్ వేసిన ఆ శ్రీ వెనకేటేశ్వర స్వామి వేషం.
అయితే ఈ సినిమాలో వెనకేటేశ్వర స్వామి వేషం కోసం మొదట శోభన్ బాబు దగ్గరికి వెళ్లారు. కానీ ఆయన అనుకున్న దానికంటే ఎక్కువ రెమ్యునరేష్ డిమాండ్ చేయడంతో.. బాలకృష్ణ దగ్గరికి వెళ్లారు. అయితే అప్పుడు నాగార్జునతో పటు టాప్ హీరోగా ఉన్న బాలయ్య.. ఇద్దరు పెద్ద హీరోలు ఇలా ఒక్కే సినిమాలో కనిపించడం ఆమన్తా మంచిది కాదు అని చెప్పి ఇందులో చేయలేదు. ఆ తర్వాత ఈ పాత్ర సుమన్ దగ్గరకు వెళ్ళింది. అప్పుడు సుమన్ వెంటనే కథకు ఓకే చెప్పాడు. అభిమానులు కూడా సుమన్ ను వెనకేటేశ్వర స్వామి వేషంలో బాగానే స్వీకరించారు.