సినిమాల గురించి ప్రత్యేకంగా ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎప్పుడూ ఎవరూ పామ్‌లో ఉంటారో మనం చెప్పడం కాస్త కష్టమే అని చెప్పాలి. ముఖ్యంగా ఎప్పుడు, ఎవరికీ ఎలాంటి అవకాశాలు వస్తాయో చెప్పలేం. ఎప్పుడు ఎవరు ఎంత గొప్పగా ఎదుగుతారో మాత్రం అస్సలు ఊహించలేమనే చెప్పాలి. చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన వారు కాస్త వయస్సు రాగానే సూపర్ స్టార్లు అవుతుంటారు.
Advertisement
మహేష్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, తరుణ్, అఖిల్ ఇలా వీరందరూ చైల్డ్ ఆర్టిస్టులుగా మెప్పించిన వారే. అదేవిధంగా మీన, రాశి, హన్సిక, షాలిని, లయ వంటి వారు చైల్డ్ ఆర్టిస్ట్లుగ నటించి తరువాత హీరోయిన్లు సత్తా చాటుతున్నారు. ఇక చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఉన్నప్పుడు నందమూరి కళ్యాణ్ రామ్ హీరోయిన్ రాశి ఒకే సినిమాలో కలిసి నటించారు. వీరిద్దరూ అన్న, చెల్లెలుగా నటించారంటే ఆశ్చర్యపోక ఉండరు. ఆ రోజుల్లో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కోడి రామకృష్ణ కాంబినేషన్ అంటే మామూలు సూపర్ హిట్ కాంబినేషన్ కాదు. వీరిద్దరి కాంబోలో వరుసగా ఆరు సినిమాలు వంద రోజులు ఆడిన చిత్రాలు ఉన్నాయి. అందులో బాలగోపాలుడు చిత్రం ఒకటి. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో నటి సుహాసిని హీరోయిన్గా నటించగా.. ఈ సినిమాకు కళ్యాణ్ రామ్, రాశి ఇద్దరూ కూడా బాల నటులుగా నటించారు.
Advertisement
ఇది కూడా చదవండి : సిల్క్ స్మితకు తోడుగా ఉన్న అన్నపూర్ణ ఎవరో మీకు తెలుసా..?
ఇక ఇందులో కళ్యాణ్ రామ్ పాత్ర పేరు రాజా కాగా.. రాశి పాత్ర పేరు లక్ష్మీ. వీరిదదరూ అనాథలు. కథలో భాగంగా బాలకృష్ణ వీరిని చేరదీసి ఆశ్రమం కల్పిస్తాడు. వాస్తవానికి అది కమర్షియల్ సినిమా అయినా.. ఈ సినిమాలో ఆర్టిస్ట్ పాత్రలకి మంచి పేరు వచ్చింది. ఇక సినిమా తప్ప కళ్యాణ్ రామ్ ఏ సినిమాలో నటించలేదు. రాశి మాత్రం చైల్డ్ ఆర్టిస్ట్‌గా తెలుగు, తమిళం, కన్నడం, మలయాళ భాషల్లో నటించి దుమ్ము రేపింది. దీంతో ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా కళ్యాణ్ రామ్, రాశి నటనకు మంచి గుర్తింపే వచ్చింది. రాశి ఆదిత్య 369, రావు గారి ఇల్లు, పల్నాటి పౌరుషం వంటి సినిమాల్లో కూడా బాలనటిగా నటించింది. ఇక ఆ తరువాత కాలంలో రాశి టాప్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. కళ్యాణ్ రామ్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. రాశి కెరీర్లో ఒకసారి బ్రేక్ ఇచ్చి ఈ మధ్యే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఇక రానున్న కాలంలో వీరిద్దరూ కలిసి ఒకే సినిమాలో కలిసి నటిస్తారేమో వేచి చూడాలి.
ఇది కూడా చదవండి : బెల్లం, పుట్నాల పప్పు కలిపి తింటున్నారా..? అయితే విషయాలు తప్పకుండా తెలుసుకోండి..!