సినిమాలో కథ బాగుండాలే కానీ మారుమూల గల్లీలో ఉన్న ప్రేక్షకులను కూడా థియేటర్ వైపు నడిపిస్తుంది. ఎవరు ఏం చేసినా కథ బాగున్న సినిమాలను ఎవరు కూడా అడ్డుకోలేరు.. కంటెంట్ లేకుండా సినిమా తీసి కోట్లాది రూపాయల బడ్జెట్ పెట్టి, విపరీతమైన ప్రమోషన్స్ చేసినా కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడతాయి.. అదే కొన్ని సినిమాలు కనీసం కోటి కూడా బడ్జెట్ పెట్టకుండా, ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే కంటెంట్ తో సినిమా తీస్తే కోట్లాది రూపాయల లాభాలే కాకుండా, ఎంతో పేరు తీసుకు వచ్చిన సినిమాలు అనేకం ఉన్నాయి.
also read:నరేష్ పవిత్రల పెళ్లి పై ఫుల్ క్లారిటీ..దీని కోసమే అంతపని చేశారా…?
Advertisement
అలాంటి వాటిలో బలగం సినిమా ఒకటి.రూ” ఒక కోటి యాభై లక్షల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తే ఎన్ని కోట్ల లాభం తెచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం.. చిన్న కథతో గ్రామాల్లో ఉండే కుటుంబాలకు సంబంధించిన బంధాలు, బంధుత్వాలు బావొద్వేగాలను కలగలిపి తీసిన సినిమాయే బలగం.. ప్రతి మనిషి జీవితంలో పుట్టుక, చావు అనేది తప్పనిసరి.. పుట్టేటప్పుడు ఏమీ తీసుకురాము, పోయేటప్పుడు కూడా ఏం తీసుకుపోము.. కేవలం ప్రేమాభిమానాలు ఉంటే మనిషి ఆత్మకు శాంతినిస్తాయని చాటి చెప్పిన మూవీ..
Advertisement
also read:మనోజ్ విష్ణు సొంత అన్నదమ్ములు కాదా..? అప్పటి నుండే ఇద్దరి మధ్య గొడవలున్నాయా..?
సాధారణంగా తెలంగాణ ప్రాంతంలో వ్యక్తి చనిపోయినప్పటి నుంచి వారి పెద్దకర్మ చేసేవరకు జరిగే ప్రాసెస్ అంతా ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్టు చూపించారు దర్శకుడు వేణు.. ప్రస్తుత కాలంలో ఈ సాంప్రదాయాలు మరుస్తున్న వేళ మరోసారి గుర్తు చేసి, ఎంతోమంది ప్రేక్షకులను కన్నీరు పెట్టించారు. ఎక్కడో విదేశాల్లో ఉండే వారు వారి పూర్వికులను గుర్తు చేసుకునే విధంగా చేశాడని చెప్పవచ్చు. దిల్ రాజ్ సమర్పణలో, ఆయన కూతురు హన్సిక, హర్షిత్ రెడ్డి బలగం సినిమాను తెరకెక్కించారు. చాలా తక్కువ బడ్జెట్ తో రిలీజ్ అయిన ఈ చిత్రం అనుకోని విధంగా కలెక్షన్స్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది.. ప్రపంచవ్యాప్తంగా కేవలం 20 రోజుల్లో 21.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్, 9.92 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.. దాదాపుగా ఈ సినిమా 18 కోట్ల లాభాలతో సక్సెస్ఫుల్ గా దూసుకుపోతుందని చెప్పవచ్చు.
also read:అన్నపూర్ణమ్మ చేసిన చిన్న తప్పుకి “ఏం నువ్ చూసుకోలేవా?” అంటూ చిరంజీవి ఎందుకు కేకలు వేశారు ?