Home » మ‌నోజ్ విష్ణు సొంత అన్న‌ద‌మ్ములు కాదా..? అప్ప‌టి నుండే ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లున్నాయా..?

మ‌నోజ్ విష్ణు సొంత అన్న‌ద‌మ్ములు కాదా..? అప్ప‌టి నుండే ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లున్నాయా..?

by AJAY

మంచు మ‌నోజ్ త‌న అనుచ‌రుడు సార‌థిపై మంచు విష్ణు దాడి చేసిన వీడియోను షేర్ చేయ‌గా నెట్టింట వైర‌ల్ అవుతోంది. వీడియోలో మ‌నోజ్ నా స‌న్నిహితుల పై బంధువుల‌పై ఇలానే దాడి చేస్తాడంటూ వ్యాఖ్యానించాడు. వీడియోలో విష్ణును ఇద్దరు వ్య‌క్తులు ఆపుతుండా ఆయ‌న కోపంతో ర‌గిలిపోతున్నాడు. ఈ వీడియోను మనోజ్ ఫేస్ బుక్ లో షేర్ చేయ‌గా త‌ర‌వాత డిలీట్ చేశాడు.

ALSO READ : Manchu Manoj-Manchu Vishnu : మంచు మనోజ్ ఇంటిపై మంచు విష్ణు దాడి.. వీడియో షేర్ చేసిన హీరో

కాగా వీరిద్ద‌రి మ‌ధ్య రెండేళ్ల నుండే విభేదాలు ఉన్నాయంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా భూమా మౌనికారెడ్డిని మ‌నోజ్ పెళ్లి చేసుకోవ‌డంతో ఆ గొడ‌వ‌లు తారాస్థాయికి చేరుకున్నాయంటూ టాలీవుడ్ లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మ‌నోజ్ వివాహంలో కూడా విష్ణు దూరంగానే ఉన్నాడు. కేవలం మ‌నోజ్ ఓ అతిధిలా పెళ్లికి వ‌చ్చి వెళ్లిపోయాడు.

అంతే కాకుండా రీసెంట్ గా తిరుప‌తిలో మోహ‌న్ బాబు యూనివ‌ర్సిటీలో జ‌రిగిన ఈవెంట్ లో ఇద్ద‌రూ ఒకేస్టేజ్ పై క‌నిపించారు. కానీ ఒక‌రితో మ‌రొక‌రు మాట్లాడుకోలేదు. ఇక ఇప్పుడు ఏకంగా విష్ణు దాడి చేసిన వీడియోను మ‌నోజ్ షేర్ చేశాడు. ఇదిలా ఉంటే మ‌నోజ్ విష్ణు ఇద్ద‌రూ సొంత అన్న‌ద‌మ్ములు కాద‌నే వార్త కూడా వైర‌ల్ అవుతోంది. మోహ‌న్ బాబు మొద‌టిభార్య విద్యాదేవికి ఇద్ద‌రు సంతానం వాళ్లే విష్ణు మ‌రియు మంచు ల‌క్ష్మి.

కాగా విద్యాదేవి అనారోగ్యంతో మ‌ర‌ణించారు. ఆ త‌ర‌వాత మోహ‌న్ బాబు విద్యాదేవి సోద‌రి నిర్మ‌లాదేవిని రెండో వివాహం చేసుకున్నారు. నిర్మ‌లాదేవికి మ‌నోజ్ జ‌న్మించారు. అయినప్ప‌టికీ మ‌నోజ్ ల‌క్ష్మీ చాలా క్లోజ్ గా ఉంటార‌ట‌. మ‌రోవైపు లక్ష్మీతో కూడా విష్ణుకు విభేదాలు ఉన్నాయ‌ని టాక్ ఉంది. కానీ మ‌నోజ్ పెళ్లిని ల‌క్ష్మీనే ద‌గ్గ‌రుండి జ‌రిపించారు. ఇక ఇప్పుడు మోహ‌న్ బాబు పెద‌రాయుడిలా కొడుకులకు పంచాయితీ చెప్పి కాంప్రమైజ్ చేస్తాడా..?ఈ గొడ‌వ ఇలానే కంటిన్యూ అవుతుందా అన్న‌ది చూడాలి.

ALSO READ : ఆస్కార్ గెలిచిన ఆర్ఆర్ఆర్ లో ఈ మిస్టేక్ ను గ‌మ‌నించారా..? జ‌క్క‌న్న ఎలా మిస్ అయ్యాడ‌బ్బా..!

Visitors Are Also Reading