Balagam Movie Review: ప్రియదర్శి ప్రధాన పాత్రలో కమెడియన్ వేణు టిల్లు దర్శకత్వంలో రూపొందిన “బలగం” సినిమా ఇవాళ థియేటర్లలో రిలీజ్ అయింది. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాకు అగ్ర నిర్మాత దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరించారు. ఇక సినిమా రివ్యూ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
READ ALSO : సోషల్ మీడియాలో ఫస్ట్ నైట్ వీడియో… అది చూసిన భార్య ఏం చేసిందంటే?
Advertisement
కథ మరియు వివరణ:
తెలంగాణలోని ఓ పల్లెటూర్లో ఉండే సాయిలు (ప్రియదర్శి)కి రెండు రోజుల్లో నిశ్చితార్థం ఉంటుంది. వచ్చే కట్నం డబ్బులతో తన అప్పులను తీర్చుకోవాలనేది సాయిలు ఆలోచన. అయితే అనుకోని కారణాలతో తాతయ్య కొమురయ్య (సుధాకర్ రెడ్డి) చనిపోతాడు. కొమురయ్యకు ఇద్దరు కొడుకులు ఐలయ్య (జయరాం), మొగిలయ్య, ఒక కుమార్తె లక్ష్మి ఉంటారు. లక్ష్మీ భర్త నారాయణ (మురళీధర్) తో ఐలయ్య, మొగిలయ్యను 20 ఏళ్ల క్రితం చిన్న గొడవ పడతారు. అప్పటినుంచి రెండు కుటుంబాల మధ్య మాటలు ఉండవు. కొమరయ్య చనిపోయాడని తెలిసిన తర్వాత లక్ష్మి, నారాయణ ఇద్దరూ ఐలయ్య ఇంటికి వస్తారు. కర్మకాండల సమయంలో కాకులకు పెట్టే ముద్దలను కాకి ముట్టనే ముట్టదు.
read also : దేవుడి ఉంగరాలు పెట్టుకుంటున్నారా… అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి..?
Advertisement
అసలు కాకులు ఎందుకు అలా చేస్తున్నాయో అర్థం కావు. మరోవైపు అప్పుల ఇబ్బందుల్లో ఉన్న సాయిలుకి మామయ్య నారాయణకి చాలా ఆస్తులు ఉన్నాయని తెలుస్తుంది. దాంతో ఆయన కూతురు సంధ్య (కావ్య కళ్యాణ్ రామ్) నీ ప్రేమలో దించే ప్రయత్నం చేస్తాడు. అసలు సాయిలు ఎందుకు అప్పుల పాలవుతాడు. కొమురయ్యకు పెట్టే ముద్దను కాకులు ఎందుకు ముట్టవు. చివరకు గొడవలు పడుతున్న కుటుంబ సభ్యులు ఎలా కలిశారు అనే విషయాలను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ఈమధ్య తెలుగు సినిమాల్లో తెలంగాణ యాస ప్రాంతాలను అక్కడి మనుషులను హైలెట్ చేయడం వంటి సక్సెస్ ఫార్ములాగా మారిందనే చెప్పుకోవాలి. అలాంటి ప్రయత్నమే చేశారు దిల్ రాజు అండ్ టీం. అయితే ఇక్కడ పక్కా కమర్షియల్ ఫార్ములాలో పెద్ద హీరో, భారీ ఫైట్స్, అదిరిపోయే డ్యాన్సులతో బలగం సినిమాను తెరకెక్కించలేదు. తెలంగాణలోని మారుమూల పల్లెటూర్లో మనుషుల మధ్య బంధాలు, గొడవలను, భావోద్వేగాలను ప్రధానంగా చేసుకొని బలగం సినిమాను రూపొందించారు.
ప్లస్ పాయింట్స్:
తెలంగాణ యాస
కథ
ప్రియదర్శి యాక్టింగ్
దర్శకత్వం
మైనస్ పాయింట్స్:
కాస్త సాగదీత
రేటింగ్ : 3/5
బాటమ్ లైన్ – “బలగం”కు కుటంబమే బలం
READ ALSO : ఉప్పెన సినిమా కథను.. వినకుండానే రిజెక్ట్ చేసిన హీరో ఎవరో తెలుసా?