తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు బాలాదిత్య. ఇండస్ట్రీలోకి బాలనటుడిగా అడుగుపెట్టిన ఈయన ఎన్నో సినిమాల్లో నటించారు హీరోగా పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపునే సంపాదించుకున్నారు. బాలాదిత్య ఒక వైపు సినిమాలలోనూ మరోవైపు బుల్లితెర సీరియల్స్ లో నటిస్తూ ఎంతో మంది తెలుగు అభిమానులను సొంతం చేసుకున్నారు. విధంగా తెలుగులో ఈయనకు ఎంతో మంచి క్రేజ్ ఉండడంతో ఈసారి బిగ్ బాస్ కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం వచ్చింది.
Advertisement
ఈ తరుణంలోనే బిగ్ బాస్ హౌస్‌లో ఎంతో సౌమ్యుడిగా కొనసాగుతున్న బాలాదిత్య పట్ల సోషల్ మీడియాలో కొంత మంది ప్రశంసలు కురిపించగా మరి కొంత మంది విమర్శలు చేస్తున్నారు. బాలాదిత్య అందరితో మంచిగా ఉన్నట్టు ప్రవర్తిస్తున్నారని ఆయన మైండ్ గేమ్ ఆడుతున్నారంటూ పలువురు భావిస్తున్నారు. బాలాదిత్య గురించి ఇలాంటి కామెంట్లు వినిపించడంతో ఆయన భార్య తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన భర్త గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
Advertisement
Also Read : రామ్ చరణ్ హీరో అవ్వడం చిరంజీవికి ఇష్టంలేదట…? ఏం అవ్వాలని కోరుకున్నాడంటే..?
తన భర్త ఇంట్లో ఎలా ఉన్నారో బిగ్ బాస్ హౌస్‌లో కూడా అలాగే ఉన్నారని నిజాయితీగా ఆడుతున్నారని తెలిపారు. బిగ్‌బాస్ హౌస్‌లో కొందరూ తన భర్తకు వెన్నుపోటు పొడుస్తున్నారంటూ ఈమె సంచలన వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్ హౌస్‌లో కొంత మంది కంటెస్టెంట్లు ఆయన మంచితనాన్ని వాడుకుంటున్నారని ఈమె బాధపడడమే కాకుండా కొన్ని టాస్క్ ల్లో ఆయన నమ్మిన వారి తనని మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త మాత్రం సరైన పద్దతిలోనే ఆటాడుతున్నారని.. ఎలాగైనా తాను టాప్ ఫైవ్‌లో ఒకరిగా ఉండి తప్పకుండా టైటిల్ గెలుచుకుంటారు అని బాలాదిత్య భార్య చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Also Read : ALLURI MOVIE REVIW & RATING : అల్లూరి సినిమా రివ్యూ..! శ్రీవిష్ణుకు మాస్ హిట్ పడినట్టేనా..?