Home » సమంత నాకు ఎదురుపడితే ఆ పని తప్పకుండా చేస్తా అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసిన చైతు..!!

సమంత నాకు ఎదురుపడితే ఆ పని తప్పకుండా చేస్తా అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసిన చైతు..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీల్లో విడాకుల పర్వం పెరిగిపోతోంది.. టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం ఈ తంతు మరీ ఎక్కువగా ఉందని చెప్పవచ్చు.. విడాకుల విషయం సాధారణంగా వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించినది మాత్రమే కానీ, ఇది మామూలు వ్యక్తుల జీవితానికి సంబంధించినది అయితే ఎలాంటి సమస్య ఉండదు, కానీ స్టార్ హీరో, హీరోయిన్ల విషయానికి వస్తే మాత్రం విషయం చిలికి చిలికి గాలివానలా మారుతుంది.. ఆ విధంగానే తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ గా పేరుపొందిన సమంత నాగచైతన్య జంట విడాకులతో దూరమయ్యారు. విరు ఈ డిసిషన్ తీసుకోవడంతో ఇండస్ట్రీలో అంతా ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఇప్పటికే సమంత నాగచైతన్య విడిపోయి పది నెలలు పూర్తి కావస్తోంది.

Advertisement

అయినా వారి వివాహ బంధానికి సంబంధించి అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అసలు వారి మధ్య వచ్చిన సమస్య ఏంటి, ఇంత దారుణమైన ఆలోచనకు దారి తీయడానికి కారణం ఏమిటో ఇప్పటికీ ఎవరికీ తెలియకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దీనిపై అక్కినేని కుటుంబం ఇప్పటి వరకు కూడా స్పందించలేదు.. ఇందులో అసలు వాస్తవం ఏంటనేది అక్కినేని కుటుంబానికి మరియు సమంత సన్నిహితులకు మాత్రమే తెలియాలి. కానీ వీరు విడిపోయిన తర్వాత కెరియర్ పై దృష్టి పెట్టి వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. సినిమా ప్రమోషన్ లో భాగంగా అప్పుడప్పుడు మీడియాతో ముచ్చటిస్తూ వారి యొక్క పర్సనల్ లైఫ్ గురించి మీడియాలో అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ వస్తున్నారు. తాజాగా సమంతా కాఫీ విత్ కరణ్ ప్రోగ్రాంలో పాల్గొంది. అక్కడ కరణ్ జోహార్ వేసిన ప్రశ్నలకు టకటకా సమాధానమిస్తూ వచ్చింది..

Advertisement

ఒకవేళ చైతు నీతో ఉండాలని కోరుకుంటే మీరు ఏం చేస్తారు అని అడగ్గా.. మా ఇద్దరినీ ఒకే గదిలో ఉంచినట్లయితే అక్కడ పదునైన వస్తువులు ఏవీ లేకుండా చూసుకోవాలని సమంత సమాధానమిచ్చింది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో నాగచైతన్యను సమంత మీకు ఎదురు పడితే ఏం చేస్తారు అని ప్రశ్నించగా.. ఆమెకు హాయ్ అని చెప్పి హగ్గిస్తానని సమాధానం చెప్పారు.. ఈ విధంగా చైతన్య చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. అలాగే మీరు ఇద్దరు కలిసి సినిమా చేయాల్సి వస్తే ఏం చేస్తారు అని అడగగా.. అలాంటి అవకాశం వస్తే బాగుంటుందని చైతు తన అభిప్రాయాన్ని బయటపెట్టారు..

also read:

Visitors Are Also Reading