పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి సినిమా సంచలన విజయం చోటు చేసుకుంది. బాహుబలి సినిమాను జక్కన్న రెండు పార్ట్ లుగా తెరకెక్కించాడు. ఈ సినిమాలో హీరోయిన్ లుగా అనుష్క, మన్నా లు నటించారు. అంతే కాకుండా విలన్ గా రానా దగ్గబాటి నటించాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన బాహుబలి పార్ట్ 1కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమా తరవాత పార్ట్ 2 పై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
Also Read: గాడ్ ఫాదర్ విజయం వెనక ఉంది ఆ ఒక్కరేనా..? ఇంతకీ ఆయన ఏం చేశాడు..!
Advertisement
అందరి మనస్సుల్లోనూ కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపారు అన్న ప్రశ్న మొదలైంది. ఇక పార్ట్ 2లో ఆ ప్రశ్నకు కూడా సమాధానం దొరికింది. పార్ట్ 2 కూడా సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కు ప్రపంచవ్యాప్తంగా రూ.1800 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఇదిలా ఉంటే బాహుబలి పార్ట్ 3 కూడా ఉంటే బాగుంటుందని ప్రేక్షకులు భావించారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో బాహుబలి సినిమా రచయిత విజయేంద్రప్రసాద్ బాహుబలి పార్ట్ 3 కూడా ఉంటుందని చెప్పారు.
Advertisement
అయితే దానికి ఇంకా సమయం పడుతుందని చెప్పారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరోసారి బాహుబలి 3 పై మరోసారి నెట్టింట చర్చ మొదలయ్యింది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో మూవీ మారథాన్ జరుగుతోంది. ఈ ఈవెంట్ లో రాజమౌళి సినిమాలను కూడా ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో రాజమౌళికి క్యూ అండ్ ఏ లో పాల్గొన్నారట. కాగా ఆ కార్యక్రమంలోనే జక్కన్న కు బాహుబలి 3కి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి.
Also Read: కోటీశ్వరుల కూతుళ్లను పెళ్లి చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరోలు…? ఎవరి అత్తగారు ఎక్కువ రిచ్ అంటే..?
దాంతో ఆయన తాను చేసిన సినిమాల్లో ఒకే ఒక సినిమా క్లైమాక్స్ ను ఓపెన్ ఎండ్ గా సంభాషణను పెట్టినట్టు చెప్పారు. అలా బాహుబలి సినిమాలో క్లైమాక్స్ లోనే జక్కన్న సంభాషణను పెట్టారు. ఆ సంభాషణ తనికెళ్ల భరణి మరియు చిన్నారి మధ్య జరుగుతుంది. స్వామీజీ వేషంలో ఉన్న తనికెళ్ల భరణితో చిన్నారి మహేంద్ర బాహుబలి కొడుకు రాజు అయ్యాడా తాతా అని అడుగుతుంది. దానికి తనికెళ్లభరణి….ఏమో శివయ్య మనసులో ఏమనుకుంటాడో నాకేటి ఎరుక…అంటూ సమాధానం ఇస్తాడు. ఇక దీనిని ఓ నెటిజన్ షేర్ చేసి బాహుబలి -3 రాబోతుంది అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
In Q&A session after the Movie Marathon, #Rajamouli said that he left only one “open-ended conversation” out of all his films. That is during Bahubali 2 end credits, there is a voice over of a small girl, hinting for Bahubali 3. How many of you observed that? #Bahubali #Bahubali3
— Anup Dasari (@anupdasari) October 3, 2022