Telugu News » Blog » కోటీశ్వ‌రుల కూతుళ్ల‌ను పెళ్లి చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరోలు…? ఎవ‌రి అత్త‌గారు ఎక్కువ రిచ్ అంటే..?

కోటీశ్వ‌రుల కూతుళ్ల‌ను పెళ్లి చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరోలు…? ఎవ‌రి అత్త‌గారు ఎక్కువ రిచ్ అంటే..?

by AJAY

హీరోల‌కు ఉండే ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ముఖ్యంగా సినిమా హీరోలు అంటే అమ్మాయి ప‌డిచ‌చ్చిపోతారు. అలాంటి హీరోల‌కు భార్య‌లు అవ్వాల‌ని ఎవ‌రు కోరుకోరు. కానీ ఆ అదృష్టం కొంత మందికే ఉంటుంది. దాదాపు హీరోలు అంతా కోటీశ్వ‌రుల ఫ్యామిలీల‌కు చెందిన అమ్మాయిల‌నే పెళ్లి చేసుకుంటారు.

Advertisement

అలా టాలీవుడ్ లో కోటీశ్వ‌రుల ఫ్యామిలీకి అల్లుడు అయిన హీరోలు ఎంత‌మంది ఉన్నారో ఇప్పుడు చూద్దాం…టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ 2011లో స్నేహారెడ్డిని వివాహం చేసుకున్నాడు.
Also Read: 11 మంది స్టార్ నటులంతా కలిసి ఒకే పాటలో కనిపించిన సినిమా ఏంటో తెలుసా..?

స్నేహారెడ్డి తండ్రి ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త కంచ‌ర్ల రెడ్డి కాగా ఆమె తల్లి క‌వితా రెడ్డి కూడా వ్యాపార‌వేత్త కావ‌డం విశేషం. వీరికి న‌గ‌రంలో విద్యాసంస్థలు ఉన్నాయి. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కూడా సంప‌న్నుల కుటుంబానికి అల్లు అయ్యాడు. చరిత్ర‌లో ఘ‌నంగా జ‌రిగిన వివాహాల‌లో ఎన్టీఆర్ వివాహం కూడా ఒక‌టి. ఎన్టీఆర్ ల‌క్ష్మీ ప్ర‌ణతిని పెళ్లి చేసుకున్నాడు. లక్ష్మీప్ర‌ణ‌తి తండ్రి ఓ మీడియా ఛాన‌ల్ అధినేత అంతే కాకుండా ఆయ‌న రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తుంటారు.

Advertisement

ఎన్టీఆర్ కు పెళ్లి స‌మ‌యంలో భారీగా క‌ట్న‌కానుక‌లు ఇచ్చారు. మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కూడా రిచ్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు.

రామ్ చ‌రణ్ భార్య తండ్రి అపోలో హాస్పిటల్స్ అధినేత అనిల్ కామినేని. త‌మిళ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తి 1999 లో సంగీత‌ను వివాహం చేసుకున్నారు. సంగీత తండ్రి శ్రీలంక‌లో ప్ర‌ముఖ వ్యాపార వేత్త‌…కాగా సంగీత విజ‌య్ కి వీరాభిమాని అత‌డిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

లాక్ డౌన్ వేళ రానా మిహికా బ‌జాజ్ ను పెళ్లి చేసుకున్నారు.మిహికా బ‌జాజ్ త‌ల్లి క్రిసాల జ్యువ‌ల‌రీస్ కు అధినేత కావ‌డం విశేషం. రీసెంట్ గా సీతారామం సినిమాతో తెలుగువారికి దగ్గ‌రైన దుల్క‌ర్ స‌ల్మాన్ స‌తీమణి అమ‌ల్ సుఫియాజ్ కూడా రిచ్ ఫ్యామిలీకి చెందిన‌వారే. అమ‌ల్ సుఫియాజ్ తండ్రి చెన్నైకి చెందిన ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త కావ‌డం విశేషం.

Also read:   హీరో సుమ‌న్ కూతురు ఎంత అందంగా ఉందో చూశారా..? ఇప్పుడు ఏం చేస్తుందంటే..?