Home » గాడ్ ఫాద‌ర్ విజ‌యం వెన‌క ఉంది ఆ ఒక్క‌రేనా..? ఇంత‌కీ ఆయ‌న ఏం చేశాడు..!

గాడ్ ఫాద‌ర్ విజ‌యం వెన‌క ఉంది ఆ ఒక్క‌రేనా..? ఇంత‌కీ ఆయ‌న ఏం చేశాడు..!

by AJAY
Ad

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన‌ గాడ్ ఫాదర్ సినిమా దసరా సందర్భంగా విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా థియేటర్లలో బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. మలయాళ సూపర్ హిట్ సినిమా లూసిఫర్ కు ఈ చిత్రం రీమేక్ గా తెర‌కెక్కింది. అయితే కథలో చాలా మార్పులు చేసి తెలుగు నేటివిటికి తగినట్టుగా మోహన్ రాజా ఈ సినిమాని తెర‌కెక్కించారు.

Advertisement

 

ఈ సినిమాలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్…. హీరో సత్యదేవ్, నటుడు సునీల్ ముఖ్యమైన పాత్రలలో నటించారు. భారీ తారాగణం ఉండటం…సినిమా టీజ‌ర్ ట్రైల‌ర్ లు ఆక‌ట్టుకోవ‌డం వల్ల ఈ సినిమాపై ముందు నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా సినిమాలో నయనతార కూడా ముఖ్యమైన పాత్రలో నటించింది. ఇక సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా విజ‌యంలో చిరంజీవి పాత్ర చాలా ఉందంటూ కొన్ని వార్తలు వైర‌ల్ అవుతున్నాయి.
Also Read: భార్యకి ఇచ్చిన మాట కోసం అన్ని అవమానాలు NTR పడ్డారంటే ?

Advertisement

ఒరిజినల్ లూసిఫర్ సినిమాను చూసిన చిరంజీవి కొన్ని మార్పులు చేర్పులు చేయాలని మోహన్ రాజా కు చెప్పారట. లూసిఫర్ లో ఉన్న‌ తప్పులను గుర్తించి వాటిని రిపీట్ అవ్వకుండా చూడాలని చెప్పారట. దాంతో ఆ టిప్స్ ను ఫాలో అవుతూ మోహన్ రాజా సినిమాను తెరకెక్కించినట్టు తెలుస్తోంది.

ఇక సినిమాలో చిరంజీవి నటనపై కూడా ప్రశంసలు కురుస్తున్నాయి. చిరంజీవి న‌ట‌న‌ వల్లే సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ సినిమాకు 92 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరిగిన సంగ‌తి తెలిసిందే. అంతేకాకుండా ఈ చిత్రం ఆదివారం నాటికి చాలా ఏరియాల‌లో బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
Also Read:  జానీ సినిమాపై జ‌రిగిన ప్ర‌యోగాల గురించి తెలుసా ?

Visitors Are Also Reading