క్రికెట్ చరిత్రలో ఈ దశాబ్దకాలంలో వెలుగులోకి వచ్చిన అద్భుతమైన ఆటగాడు ఎవరు అంటే అందరూ చెప్పే పేరు విరాట్ కోహ్లీ. తన బ్యాటింగ్ అలాగే యాటిట్యూడ్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు విరాట్. కానీ ప్రస్తుతం గత కొంత కాలంగా విరాట్ ఫామ్ లో లేడు. పరుగులు చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. సెంచరీలు సునాయాసంగా బాదే కోహ్లీ శతకం చేయక మూడేళ్లు అవుతుంది. అయిన కూడా ఇది ప్రతి ఆటగాడికి వచ్చే పరిస్థితే అని ప్రపంచంలోని అందరూ ఆటగాళ్లు అతనికి మద్దతుగా నిలుస్తున్నారు. కానీ పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ మాత్రం కోహ్లీని అవమానించాడు.
Advertisement
బాబర్ ఆజమ్.. ప్రస్తుతం క్రికెట్ కెరియర్ లో మంచి పిక్ ఫామ్ లో ఉన్నాడు. భారీగా పరుగులు చేస్తూ.. విరాట్ కోహ్లీ గతంలో నెలకొల్పోయిన కొన్ని రికార్డులను కూడా బ్రేక్ చేస్తూ వస్తున్నాడు. ఇక ఈ క్రమంలోనే తాజాగా శ్రీలంక పర్యటనకు పాక్ జట్టు వెళ్లే ముందు మీడియాతో మాట్లాడుతూ బాబర్ కోహ్లీని హేళన చేసినట్లు కామెంట్స్ చేసాడు. అయితే ఈ సమావేశంలో ఒక్కరు ”మీరు ఈ మధ్య విరాట్ కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసారు కదా” అని ప్రశ్నించగా.. ”ఏది” అని బాబర్ తిరిగి అడిగాడు. దానికి ”ఎక్కువ రోజులు ఐసీసీ ర్యాంకింగ్స్ లో మొదటి స్థానంలో ఉండటం” అని తెలిపాడు. అప్పుడు ‘అదా’ అంటూ సమాధానం ఇచ్చాడు బాబర్.
Advertisement
అయితే ఇదే విషయం ఇప్పుడు కోహ్లీ ఫ్యాన్స్ కు కోపం తెప్పిస్తుంది. ఈ విషయంలో సోషల్ మీడియా వేదికగా బాబర్ ను తెగ ట్రోల్ చేస్తున్నారు. నువ్వు ఏదో కోహ్లీ అన్ని రికార్డులు బ్రేక్ చేసినట్లు ప్రవర్తిస్తున్నాను. ఇప్పుడు కోహ్లీ ఫామ్ లో లేడు అందుకే ని పేర వినిపిస్తుంది. ఒక్కసారి కోహ్లీ పరుగులు చేయడం ప్రారంభిస్తే మళ్ళీ నువ్వు కనిపించవు అని అంటున్నారు. అలాగే కోహ్లీ సాధించిన ఫీట్స్ అనేవి అందుకోవడం ని కెరియర్ లో సాధ్యం కాదు అని చెబుతున్నారు. అదే విధంగా కోహ్లీ ఒక్క సెంచరీ చేసి ఇలాంటి వారందరికీ బుద్ధి చెప్పాలి అని కోరుకుంటున్నారు ఫ్యాన్స్.
ఇవి కూడా చదవండి :