బాబర్ ఆజాం పాకిస్థాన్ జట్టులోకి వచ్చిన తర్వాత.. ఆ జట్టు యొక్క బ్యాటింగ్ బలం పెరిగింది అనేది నిజం. అలాగే వెంటనే పాకిస్థాన్ జట్టుకు మొహ్మద్ రిజ్వాన్ వంటి మరో స్టార్ కీపర్ బ్యాటర్ దొరికేసాడు. ఈ ఇద్దరు ఓపెనర్లుగా జట్టును ముందుకు నడిపిస్తూ వచ్చారు. కానీ ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్ లో మాత్రం రిజ్వాన్ చెలరేగుతుంటే.. బాబర్ వరుసగా అన్ని మ్యాచ్ లలో ఫెయిల్ అవుతున్నాడు.
Advertisement
ఈ క్రమంలోనే నిన్న శ్రీలంక, పాకిస్థాన్ మధ్య సూపర్ 4 లో భాగంగా జరిగిన మ్యాచ్ లో ఓ ఘటన అనేది చోటు చేసుకుంది. బ్యాటింగ్ లో రాణించాపోయినంత మాత్రమే బాబర్ న కెప్టెన్ గా లెక్క చేయలేదు అంపైర్. అసలు ఏం జరిగిందంటే.. లంకతో మ్యాచ్ లో కీపర్ రిజ్వాన్ క్యాచ్ అప్పీల్ చేయగా.. అంపైర్ ఇవ్వలేదు. దాంతో అతను రివ్యూ కోరగా.. ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్ కు సిగ్నల్ ఇచ్చారు.
Advertisement
కానీ ఎప్పుడైనా రివ్యూ అనేది జట్టు కెప్టెన్ కోరినపుడే ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్ కు సూచిస్తాడు. కానీ పాక్ జట్టు కెప్టెన్ బాబర్ అయితే రిజ్వాన్ సిగ్నల్ పైన అంపైర్ ఆలా చేసాడు. దాంతో షాక్ అయిన బాబర్.. నేను కెప్టెన్ అంటూ చెబుతూ అంపైర్ వద్దకు వచ్చాడు. కానీ అప్పటికే అంత జరిగిపోగా… బాబర్ ఏం చేయలేకపోగా.. పాక్ ఆటగాళ్లు కూడా నవ్వుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
ఇవి కూడా చదవండి :