Home » 22 మందిని బోల్తా కొట్టించిన అక్షర్ పటేల్..!

22 మందిని బోల్తా కొట్టించిన అక్షర్ పటేల్..!

by Azhar
అక్షర్ పటేల్.. ప్రస్తుతం టీం ఇండియాలో ఎక్కువ చర్చ అనేది జరుగుతున్న పేరు. ఐపీఎల్ లో 10 ఏళ్ళ పాటు నిలకడగా రాణిస్తూ.. టీం ఇండియాలో చోటు అనేది అందుకున్నాడు. ఇక ప్రస్తుతం భారత జట్టుకు మూడు ఫార్మాట్ లో కీలక ఆల్ రౌండర్ గా ఎదుగుతున్నాడు. కానీ జడేజా లేకుంటేనే అక్తర్ కు ఛాన్స్ అనేది వస్తుంది. ఇక ప్రస్తుతం ఆసీస్ తో జరుగుతున్న టీ20 సిరీస్ లో అక్షర్ బాగా రాణిస్తున్నాడు.
మొదటి మ్యాచ్ లో ఇండియా ఓడిపోయిన అక్షర్ బౌలింగ్ అద్భుతంగా ఉంది. ఇక రెండో మ్యాచ్ లో కూడా కేవలం రెండు ఓవర్లు మాత్రమే వేసి.. రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. గ్లెన్ మాక్స్‌వెల్ వచ్చిన మొదటి బంతికే అక్షర్ బౌలింగ్ లో సిక్స్ కొట్టాలి అని ప్రయత్నించి… క్లిన్ బౌల్డ్ అయ్యాడు. అక్షర్ వేసిన రెండో ఓవర్ లో టిమ్ డేవిడ్ కూడా అలానే ఔట్ అయ్యారు.
అయితే ఈ ఇద్దరు బ్యాటలు కూడా బంతి స్పిన్ తో టర్న్ అవుతుంది అని తప్పు అంచనా వేయడంతో బౌల్డ్ అయ్యారు. అయితే లెఫ్ట్ హ్యాండ్ ఆర్థోడాక్స్ బౌలర్ అయిన అక్షర్ కుడి చేతం వాటం బ్యాటరలకు బౌలింగ్ చేసే సమయంలో బాల్ ను ఎక్కువగా స్పిన్ చేయడు. ఈ ఇద్దరిని ఔట్ చేసిన ఇదే ప్లాన్ తో ఈ ఏడాది మొత్తం అక్షర్ ఇప్పటికే 22 మంది కుడిచేతి వాటం బ్యాటర్లను ఔట్ చేయడం గమనార్హం.
Visitors Are Also Reading