తెలుగు చలనచిత్ర రంగంలో కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన వేణు అందరికీ పరిచయమే. నవదీప్ హీరోగా నటించిన జై.. అదేవిధంగా తేజ సినిమాలతో పాటు ప్రభాస్ నటించిన మున్నా సినిమాలో కీలకపాత్ర పోషించారు వేణు. ఇక జబర్దస్త్ ప్రారంభంలో వేణు టీం లీడర్ గా వ్యవహరించిన విషయం అందరికీ తెలిసిందే. అప్పట్లో ఆయన టీమ్ లోనే సుడిగాలి సుధీర్, గెటప్ శీను, రాంప్రసాద్ టీమ్ మెంబర్స్ గా కొనసాగారు. అయితే వేణు వెళ్లిపోయిన తరువాత ఈ ముగ్గురు మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. కాగా ఇప్పుడు వేణు ‘బలగం’ సినిమాతో దర్శకుడిగా మారారు.
Advertisement
తెలంగాణ సిరిసిల్ల ప్రాంతానికి చెందిన వేణు తాను మొదటి క్యారెక్టర్ చేసిన సినిమా ఫ్రీ రిలీజ్ వేడుక సొంత ఊరిలోనే నిర్వహించారు. ఈ వేడుకకు రాంప్రసాద్, సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర విచ్చేశారు. ముఖ్యఅతిథిగా తెలంగాణ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ వేడుకకు విచ్చేసినటువంటి ఆటో రాంప్రసాద్ మాట్లాడుతూ.. సినిమాకి సంబంధించి అనేక విషయాలు తెలియజేశారు. “బలగం” ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా అని తెలిపారు.
Advertisement
ఇక ఇదే సమయంలో బలగం సినిమా చూస్తున్న సమయంలో సినిమాలో ఐ టెం సాంగ్స్ లేవా అని సుధీర్ తనని ప్రశ్నించినట్లు రాంప్రసాద్ చెప్పుకొచ్చాడు. అయితే సుధీర్ కోసం బలగం 2 తీయండి అని నిర్మాతలను కోరారు. ఆ ప్రశ్న సుధీర్ తనని అడిగిన సమయంలో ఇది నువ్వు.. చేసే టైపు సినిమా కాదు అని చెప్పడం జరిగిందని అనడంతో.. మంత్రి కేటీఆర్ తో పాటు దర్శకులు, నిర్మాతలు ఒక్కసారిగా పగలబడి నవ్వారు. దీంతో ఆటో రాంప్రసాద్ పంచ్ ఒక్కసారిగా సుడిగాలి సుధీర్ పరువు తీసేసినట్టు అయింది. వేణు దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 03న విడుదల కానుంది. ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో మరీ వేచి చూడాలి.
Also Read : సౌందర్య చనిపోయే ముందు ఎన్ని నెలల గర్భవతో తెలుసా..?