Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » సౌందర్య చనిపోయే ముందు ఎన్ని నెలల గర్భవతో తెలుసా..?

సౌందర్య చనిపోయే ముందు ఎన్ని నెలల గర్భవతో తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ads

తెలుగు ఇండస్ట్రీలో కొంతమంది స్టార్ల జీవితం చూసుకుంటే చాలా బాధ కలుగుతుంది. ఇండస్ట్రీ లోకి వచ్చి వారి నటన టాలెంట్ తో ఎంత ఫాస్ట్ గా పేరు సంపాదించుకున్నారో అంతే ఫాస్ట్ గా ఇండస్ట్రీని వదిలి ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు. అలాంటి వారిలో చెప్పుకోవాల్సింది ఉదయ్ కిరణ్, సౌందర్య.. వీరి ఇండస్ట్రీలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగారు. అలాంటి వీరు ఇండస్ట్రీని వదిలి అభిమానులకు కుటుంబ సభ్యులకు బాధను మిగిల్చారు. అలాంటి వారిలో సౌందర్య గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.

Advertisement

Ad

ఆమె ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఓ రేంజ్ మైంటైన్ చేశారు. ఆమె డేట్స్ కోసం దర్శక, నిర్మాతలు కూడా వేచి ఉండేవారు అంటే ఆమెకి ఎలాంటి క్రేజ్ ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పోజింగ్ పాత్రలు చేయకుండా కేవలం తన అందం, నటన అభినయంతో ఇండస్ట్రీలో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది. ఎంత ఫాస్ట్ గా ఇండస్ట్రీలో ఎదిగిందో అంతే స్పీడుగా ఇండస్ట్రీని వదిలి విమాన ప్రమాదంలో మరణించింది. అలాంటి సౌందర్య తన జీవితంలో పేరుతో పాటు ఎంతో డబ్బు కూడా సంపాదించింది. కనీసం ఆ డబ్బు కూడా అనుభవించకుండా మరణించింది.

Advertisement

also read;ఆ హీరోయిన్ తో సిద్దార్థ్ వీడియో… నెట్టింట వైరల్…!

ఎంతో ఇష్టపడి తన బావని పెళ్లి చేసుకొని, గర్భవతి అయిన తర్వాత ఇక నా జీవితం హ్యాపీగా సాగుతుంది అనుకున్న సమయంలో ఆమె మరణించిందని తన స్నేహితురాలు ఆమని ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. జీవితంలో ఎంతో కష్టపడి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని ఇక అనుభవించుదామని టైం కు ఆమె పరమపదించిందని నటి ఆమని తెలియజేసింది.

also read:

Visitors Are Also Reading