Home » ఆ హీరోయిన్ తో సిద్దార్థ్ వీడియో… నెట్టింట వైరల్…!

ఆ హీరోయిన్ తో సిద్దార్థ్ వీడియో… నెట్టింట వైరల్…!

by AJAY
Ad

టాలీవుడ్ లో లవర్ బాయ్ గా ఇమేజ్ సంపాదించుకున్న హీరో సిద్దార్థ్. తెలుగుతో పాటు తమిళ హిందీ భాషల్లోనూ సిద్ధార్థ్ హీరోగా నటించాడు. బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు సినిమాలతో సిద్దార్థ్ అభిమానులను సంపాదించుకున్నాడు. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించాడు. రీసెంట్ గా తెలుగులో మహాసముద్రం అనే సినిమాలో హీరోగా నటించాడు. అయితే ఈ సినిమా సమయంలోనే హీరోయిన్ అదితి రావు హైదరి తో క్లోజ్ అయ్యాడు.

Advertisement

siddarth

siddarth

 

ఆ తర్వాత ఇద్దరు కలిసి చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. గతంలో ఇద్దరు కలిసి ముంబైలో చెక్కర్లు కొడుతున్న వీడియో ఒకటి వైరల్ అయింది. ఆ సమయంలో సిద్ధార్థ కెమెరా మెన్ ను సైతం హెచ్చరించాడు. ఆ ఫోటోలు బయటకు రావద్దు అంటూ సైగలు చేశాడు. అంతేకాకుండా రీసెంట్ గా వీరిద్దరూ ఓ హీరో పెళ్లిలోనూ సందడి చేశారు. దాంతో ఇద్దరి రిలేషన్ షిప్ నిజమే అంటూ వార్తలు వినిపించాయి.

Advertisement

Visitors Are Also Reading