Home » Aug 29th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

Aug 29th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

మళ్లీ రికార్డుస్థాయికి రూపాయి విలువ రికార్డు స్థాయికి పతనం అయ్యింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 80.13కి చేరింది.

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కు భారీ వరద నీరు చేరుకుంది. 10 గేట్లు 5 ఫీట్లు, మరో 10 గేట్లు 10 ఫీట్ల మేర మొత్తం 20 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో 3,20,326 క్యూసెక్కులు ఉండగా ఔట్‌ ఫ్లో 2,79,270 క్యూసెక్కులుగా ఉంది.

Advertisement

ఎన్‌సీఆర్బీ 2021 నివేదిక విడుదల విడుదల చేసింది. నివేదిక ప్రకారం 2021లో తెలంగాణలో క్రైమ్‌ రేట్ పెరిగింది. రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరగడం తో పాటు చిన్నారులపై లైంగిక నేరాలు పెరిగాయి. మానవ అక్రమ రవాణాలో మొదటి స్థానం లో నిలిచింది. సైబర్ నేరాల్లో మొదటి స్థానంలో నిలవడం తో పాటు రైతుల ఆత్మ హత్యల్లో 4వ స్థానంలో నిలిచింది. ఆర్ధిక నేరాల్లో రెండో స్థానంలో ఉంది.

Advertisement

ఇవాళ తెలంగాణకు వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర కర్ణాటక నుంచి తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడింది. దాని ప్రభావంతో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది.

పాకిస్థాన్‌లో వరదల బీభత్సం కారణంగా ఇప్పటి వరకు 1,033 మంది మృత్యువాత పడ్డారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

నేడు నాసా మానవ రహిత ఆర్టెమిస్‌-1 ప్రయోగం జరనుంది. వ్యోమగాములు లేకుండా చంద్రుడిపై స్పేష్‌షిప్‌ ను ప్రయోగించనున్నారు.

నేడు పర్యాటక రంగంపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఉదయం 11 గంటలకు ఉన్నతాధికారులతో సీఎం భేటీ కానున్నారు.

పాకిస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది. పాకిస్థాన్-147 ఆలౌట్.. భారత్-148/5 (19.4 ఓవర్ల) స్కోర్ తో విజయం సాధించింది.

ఇండోనేషియా లో భూకంపం సంభవించింది. రాజదాని సుమత్రా కు సమీపంలో భూకంపం చోటు చేసుకుంది. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

Visitors Are Also Reading