Home » Aug 28th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

Aug 28th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

నోయిడాలోని ట్విన్ టవర్స్ ను నేడు కూల్చేస్తున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ముహూర్తం దేశంలోనే తొలిసారి భారీ భవనాల కూల్చివేయనున్నారు. 9 సెకన్లలో టవర్స్ కుప్ప కూలనున్నాయి.

 

నేడు తెలంగాణలో కానిస్టేబుల్‌ రాత పరీక్షను నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగనుంది. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతి నిరాకరించనున్నారు.

Advertisement

 

నేడు దేశవ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలు జరుగుతున్నాయి.

 

రైతు సంఘాల నేతలతో ముగిసిన సీఎం కేసీఆర్ సమావేశం ముగిసింది. ఉదయం నుంచి రాత్రి వరకు రైతులతో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించారు. 20కి పైగా రాష్ట్రాల నుంచి రైతు సంఘాల నేతలు సమావేశానికి హాజరయ్యారు.

 

శ్రీశైలం జలాశయానికి వరద ఉదృతి పెరుగుతోంది. 4 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో 2,35,312 క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 1,75,389 క్యూసెక్కులు ఉంది.

Advertisement

నేడు, రేపు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరశాఖ వెల్లడించింది. కర్ణాటక ఉత్తర తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడే అవకాశం ఉంది. దాంతో ఆది, సోమవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ కానుంది. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు లక్ష్యంగా సమావేశం జరగనుంది. ఈ మీటింగ్ లో సోనియా, రాహుల్ ,ప్రియాంకా గాంధీ లు వర్చువల్ గా పాల్గొనబోతున్నారు.

corona omricon

corona omricon

దేశంలో కరోనా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 9,560 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. 41 మంది కరోనా తో ప్రాణాలు కోల్పోయారు.

తెలంగాణ లో మధ్యాహ్న భోజనం బంద్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా చోట్ల బిల్లులు రాక వంట కార్మికులు అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో బంద్ కు పిలుపునిచ్చారు.

 

నేడు ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. దాంతో క్రికెట్ ప్రియులు ఉత్కంఠ గా ఎదురు చూస్తున్నారు.

Visitors Are Also Reading