Home » ట్రైన్‌లో చోరీకి య‌త్నం.. దొంగ‌కు భ‌లేగా బుద్ధి చెప్పిన ప్ర‌యాణికుడు..!

ట్రైన్‌లో చోరీకి య‌త్నం.. దొంగ‌కు భ‌లేగా బుద్ధి చెప్పిన ప్ర‌యాణికుడు..!

by Anji
Ad

సాధారణంగా రైల్వేస్టేష్‌, బ‌స్టాప్ లాంటి ర‌ద్దీ ప్ర‌దేశాల్లో దొంగ‌లు చోరీలు ఎక్కువ‌గా చేస్తుంటారు. ముఖ్యంగా ఎప్పుడూ జ‌నాల‌తో కిట‌కిట‌లాడే ప్ర‌దేశాల్లోనే కొంచెం ఏమ‌ర‌పాటుగా ఉన్నా వారు మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దు. రైల్వే స్టేష‌న్ ప్ర‌యాణికుల‌కు చుక్క‌లు చూపించే దొంగ‌కు రివ‌ర్స్ లో ప్ర‌యాణికుడే దొంగ‌కు చుక్కలు చూపించాడు. కిటికి లోంచి సెల్‌ఫోన్‌ను చోరీ చేసేందుకు య‌త్నించిన దొంగ చేయి ప‌ట్టుకుని రైలు బ‌య‌టి గాలిలో వేలాడుతూ కొన్ని కిలోమీట‌ర్ల ప్ర‌యాణించేవిధంగా చేశాడు. ఈ సంఘ‌ట‌న బీహార్‌లో చోటు చేసుకుంది.

Advertisement

Also Read :  అక్కినేని ఫ్యామిలీ లో చైతూ లానే మరో వారసుడు….? కానీ ఆ కారణం వల్లే సినిమాల్లోకి రావడం లేదట…!

ఇటీవ‌ల ఓ రైలు బెగుస‌రాయ్ నుంచి ఖ‌గారియాకి వెళుతోంది. ఆ ట్రైన్ సాహెబ్‌పూర్ క‌మాల్ స్టేష‌న్‌లో ఆగిన‌ప్పుడు ఓదొంగ క‌న్ను కిటికి ప‌క్క‌న కూర్చున్న ప్ర‌యాణికుడి సెల్‌ఫోన్ పై ప‌డింది. రైలు నెమ్మ‌దిగా క‌దులుతున్న స‌మ‌యంలో ఆ దొంగ కిటికిలోంచి మొబైల్ ఫోన్ దొంగిలించ‌డానికి ప్ర‌య‌త్నించాడు. అప్పుడే అప్ర‌మ‌త్తం అయిన ప్ర‌యాణికుడు కిటికి లోప‌లికి వ‌చ్చిన దొంగ చేయిని గ‌ట్టిగా ప‌ట్టుకున్నాడు. అదే స‌మ‌యంలో ఒక్క‌సారిగా రైలు వేగం పెరిగింది. దీంతో త‌న చేయింని వ‌దిలివేయాల‌ని ప్ర‌యాణికుడిని ఆ దొంగ వేడుకున్నాడు. ఈ లోపు ట్రైన్ ప్లాట్‌ఫాం దాటింది. దీంతో ఆ దొంగ బ‌య‌టే వేలాడాడు. ర‌క్షించండి అంటూ గ‌ట్టిగా అరిచాడు.

Advertisement

ప‌ట్టు కోసం దొంగ మ‌రో చేయిని లోప‌లికి చాచాడు. రైలులో ఉన్న వారు అత‌ని రెండు చేతుల‌ను ప‌ట్టుకొని కింద‌ప‌డ‌కుండా చూసారు. 15 కిలోమీట‌ర్ల వ‌ర‌కు ఆ దొంగ కదులుతున్నా రైలు బ‌య‌ట గాల్లోనే వేలాడాడు. ట్రైన్ ఖ‌గారియా స్టేష‌న్ రాగానే ప్ర‌యాణికులు అత‌డి చేతులు వ‌దిలేశారు. వెంట‌నే కింద‌ప‌డిపోయి నొప్పితో విల‌విల‌లాడాడు. ఖ‌గారియా రైల్వే పోలీసుల‌కు అప్ప‌గించారు. పంక‌జ్ కుమార్‌గా గుర్తించారు. ప్ర‌స్తుతం దొంగ రైలుకు వేలాడ‌డంకి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈ వీడియో లైకులు, కామెంట్ల వ‌ర్షం కురుస్తోంది. దొంగ‌కు మంచి గుణ‌పాఠం చెప్పార‌ని కొంద‌రూ ట్వీట్స్ చేస్తుంటే.. కిటికీ వేలాడ‌దీయడం చాలా దారుణ‌మ‌ని మ‌రికొంద‌రూ కామెంట్లు పెడుతున్నారు. మ‌రికొంద‌రూ ప్రాణం పోతే ఎవ‌రిదీ బాధ్య‌త అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Also Read :  బ్లాక్ టీ యొక్క‌ ప్ర‌యోజ‌నాలు తెలిస్తే మీరు అస్స‌లు వ‌ద‌ల‌రు..!

Visitors Are Also Reading