Home » అసిస్టెంట్ డైరెక్ట‌ర్ నుండి హీరోలుగా ఎదిగిన టాలెంటెడ్ హీరోలు వీరే..!

అసిస్టెంట్ డైరెక్ట‌ర్ నుండి హీరోలుగా ఎదిగిన టాలెంటెడ్ హీరోలు వీరే..!

by AJAY
Ad

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండ‌స్ట్రీకి వ‌చ్చాక అనుకున్న‌ది అన‌కున్న‌ట్టు జ‌ర‌గాలంటే క‌ష్ట‌మే. కొంత‌మంది హీరోలు అవుదామ‌ని వ‌చ్చి ద‌ర్శకులు అవ్వొచ్చు. మ‌రికొంత‌మంది ద‌ర్శ‌కులు గా ఎంట్రీ ఇచ్చి న‌టుడు హీరోగా సెటిల్ అవ్వొచ్చు. అంతే కాకుండా హీరో అవుదామ‌ని వ‌చ్చిన ఎంతో మంది ముందుగా ఏదో ఒక అవ‌కాశమ‌ని అసిస్టెంట్ డైరెక్ట‌ర్ లు గా మారుతుంటారు. అలా అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌నిచేసి హీరోలుగా రానిస్తున్న వాళ్లు ఎవ‌రో ఇప్పుడు చూద్దాం.

నాని అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా తన కెరీర్ ను ప్రారంభించాడు. కానీ అష్టాచెమ్మా సినిమాలో హీరోగా అవ‌కాశం రావ‌డం ఆ సినిమా హిట్ అవ్వ‌డంతో ప్ర‌స్తుతం టాప్ హీరోల లిస్ట్ లో చేరిపోయి వ‌రుస సినిమాలు చేస్తున్నారు.

Advertisement

NANI

NANI

మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ కూడా ముందుగా అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గానే త‌న కెరీర్ ను ప్రారంభించాడు. కానీ ఆ త‌ర‌వాత సినిమాల‌లో చిన్న చిన్న పాత్ర‌లు రావ‌డం న‌టుడిగా మంచి గుర్తింపు తెచ్చుకోవ‌డంతో హీరోగా కూడా అవ‌కాశాలు అందుకున్నాడు. ఇక ప్ర‌స్తుతం స్టార్ హీరోల లిస్ట్ లో చేరి మాస్ మ‌హ‌రాజ్ గా ఎంతోమంది అభిమానుల‌ను సంపాధించుకున్నాడు.

raviteja

raviteja

అంతే కాకుండా యంగ్ హీరో రాజ్ త‌రుణ్ కూడా అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గానే త‌న కెరీర్ ను ప్రారంభించాడు. కానీ ఉయ్యాల జంపాల సినిమాలో హీరోగా అవ‌కాశం రావ‌డంతో అత‌డి ఫేట్ మారిపోయింది. ఉయ్యాల జంపాల సినిమా హిట్ కావ‌డం ఈ సినిమా త‌ర‌వాత వ‌రుస హిట్ లు అందుకోవ‌డంతో హీరోగా ఫుల్ బిజీ అయ్యాడు.

Advertisement

RAJ THARUN

RAJ THARUN

ఇక ల‌వ‌ర్ బాయ్ సిద్ధార్థ్ కూడా త‌న కెరీర్ ను అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గానే ప్రారంభించాడు. కానీ సిద్ధార్థ్ కు హీరోగా అవ‌కాశాలు రావ‌డం తన‌ను తాను ప్రూవ్ చేసుకోవ‌డంతో ల‌వ‌ర్ బాయ్ ఇమేజ్ ను సొంతం చేసుకుని అమ్మాయిల హృద‌యాల్లో నిలిచిపోయాడు. రీసెంట్ గా మ‌హాస‌ముద్రం సినిమాతో మ‌రోసారి తెలుగువాళ్ల‌ను ప‌ల‌క‌రించాడు.

SIDDHARH

SIDDHARH

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో తెలుగు వారికి ప‌రిచ‌మైన నిఖిల్ కూడా త‌న కెరీర్ ను అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గానే ప్రారంభించాడు. కానీ నిఖిల్ ప్ర‌స్తుతం హీరోగా ఫుల్ బిజీగా మారాడు. వ‌రుస హిట్ లు అందుకున్ననిఖిల్ విభిన్నపాత్ర‌లు చేస్తూ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నాడు.

NIKHIL

NIKHIL

వ‌రుస హిట్ లు అందుకున్ననిఖిల్ విభిన్నపాత్ర‌లు చేస్తూ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నాడు.

Also Read:అన్న‌య్య‌, శంక‌ర్ దాదా సినిమా త‌ర్వాత మ‌ళ్లీ చిరుతో జ‌త‌క‌ట్ట‌నున్న ర‌వితేజ‌!

NIKHIL

Visitors Are Also Reading