Home » అన్న‌య్య‌, శంక‌ర్ దాదా సినిమా త‌ర్వాత మ‌ళ్లీ చిరుతో జ‌త‌క‌ట్ట‌నున్న ర‌వితేజ‌!

అన్న‌య్య‌, శంక‌ర్ దాదా సినిమా త‌ర్వాత మ‌ళ్లీ చిరుతో జ‌త‌క‌ట్ట‌నున్న ర‌వితేజ‌!

by Azhar

మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఆయన సెకండ్ ఇన్నింగ్స్ సక్సెస్ రేట్ కూడా బాగానే ఉంది. ప్రస్తుతం ఆయ‌న మెగాస్టార్ చిరంజీవి మరో కొత్త సినిమాను మొదలు పెట్టారు. మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భోళాశంకర్’ చిత్రం పూజా కార్యక్రమాలు జరుపుకుంది. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు చిరంజీవిపై క్లాప్ కొట్టగా, మరో దర్శకుడు కొరటాల శివ స్క్రిప్టును చిత్రబృందానికి అందించారు. ఏకే ఎంటర్‌టైన్‌ మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. తమిళంలో అజిత్ హీరోగా వచ్చిన ‘వేదాళం’ చిత్రాన్ని తెలుగులో ‘భోళాశంకర్’ గా రీమేక్ చేస్తున్నారు. ఇందులో చిరంజీవికి చెల్లెలుగా కీర్తి సురేశ్ నటిస్తోంది. కాగా, ఈ మూవి పూజ కార్యక్రమానికి హీరోయిన్ తమన్నా, దర్శకులు వంశీ పైడిపల్లి, హరీశ్ శంకర్, గోపీచంద్ మలినేని, వీవీ వినాయక్, బాబీ, సినీ ప్రముఖులు తదితరులు హాజరయ్యారు.

ఇక ఈ చిత్రంలో మాస్ మ‌హారాజా ర‌వితేజ కూడా న‌టిస్తున్న‌ట్లు స‌మాచారం. అయితే వీరిద్ద‌రూ క‌లిసి గ‌తంలోనే స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అన్న‌య్య చిత్రంలో ఓ త‌మ్ముడి పాత్ర‌లో ర‌వితేజ క‌నిపిస్తాడు. త‌ర్వాత శంక‌ర్‌దాదా ఎంబిబిఎస్‌లో ఓ పాట‌లో త‌ళుక్కున్న మెరుపులా మెరిసి వెళ్ళిపోతాడు. అయితే అప్ప‌ట్లో ర‌వితేజ‌కి ఉన్న క్రేజ్ వేరు. అన్న‌య్య సినిమాలో ర‌వితేజ‌కి అంత పెద్ద క్రేజ్ లేదు. మ‌రి ప్ర‌స్తుతం ఇప్పుడు ర‌వితేజ‌కి ఓ ఇమేజ్ ఉంది. దాదాపు పెద్ద హీరోల‌తో స‌మ‌కాలికుడ‌ని చెప్పాలి. మ‌రి ఎంతో కీల‌క పాత్ర అయితే త‌ప్పించి ర‌వితేజ ఇందులో న‌టించ‌డానికి ఒప్పుకోడు. ద‌ర్శ‌కుడు ఎంతో ప్రాధాన్య‌త ఉన్న పాత్ర‌నే మాస్ మ‌హారాజాకి ఇచ్చిఉంటాడు అని అంద‌రూ అనుకుంటున్నారు.

ఇక చిరంజీవి పాత్ర వ‌చ్చేసి పాత‌బ‌స్తీలో ఒక పాత్ర త‌ర్వాత అంతా క‌ల‌క‌త్తాలో ఓ పాత్ర ఉంటుంద‌ని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. గ‌తంలో కూడా చిరంజీవి చూడాల‌ని వుంది సినిమా కూడా క‌ల‌క‌త్తా బ్యాక్‌బ్రాప్‌లో న‌డుస్తుంది. ఒక‌వేళ చిరుకి క‌ల‌క‌త్తా ఏమ‌న్నా సెంటిమెంటిఏమో. ఇక ఏది ఏమైనా మొత్తానికి ఇద్ద‌రు మాస్ హీరోలు తెర మీద క‌న‌బ‌డితే ఆడియ‌న్స్ ని ఇక ఆప‌గ‌ల‌మా విజిల్సే విజిల్స్‌


You may also like