Home » పాకిస్తాన్ ఆసియా కప్ ఫైనల్ కి చేరాలంటే ఇద్దోక్కటే మార్గమా ? దీనికి ఇండియా నే సహాయం చెయ్యాలా ? ఎలాగంటే ?

పాకిస్తాన్ ఆసియా కప్ ఫైనల్ కి చేరాలంటే ఇద్దోక్కటే మార్గమా ? దీనికి ఇండియా నే సహాయం చెయ్యాలా ? ఎలాగంటే ?

by Sravya
Ad

ఆసియా కప్ సూపర్ ఫోర్ దశలో పాకిస్తాన్ పై టీం ఇండియా అదరకొట్టేసింది. నిన్న జరిగిన మ్యాచ్ ని చూసినట్లయితే, పాకిస్తాన్ ని ఒక ఆట ఆడేసుకుంది. ఇండియా కొలంబోలోని ఆర్ ప్రేమదాస్ స్టేడియం లో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ ని భారత్ చిత్తూ చేసింది. ఆదివారం ఓపెనర్ రోహిత్, గిల్ హాఫ్ సెంచరీలు చేశారు. సోమవారం కంటిన్యూ అయిన మ్యాచ్ లో రాహుల్, విరాట్ కోహ్లీ సెంచరీలు కొట్టేశారు. టీమిండియా బౌలర్ల ఆట తీరు కూడా బాగుండడంతో 228 పరుగుల భారీ విజయం దక్కింది.

Advertisement

పాకిస్తాన్ 357 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగింది. ఇంత లక్ష్యాన్ని పాకిస్తాన్ పూర్తి చేయలేకపోయింది. 32 ఓవర్లలో 128/8 మాత్రమే పాకిస్తాన్ పూర్తి చేయగలిగింది. ఇక ఇప్పుడు పాకిస్తాన్ భవిష్యత్తు ఇండియా చేతుల్లో ఉంది. ఆసియా కప్ 2023 సూపర్ ఫోర్ స్టాండింగ్స్ లో టీం ఇండియా టాప్ లో ఉంది. ప్రస్తుత స్టాండింగ్స్ లో పాకిస్తాన్ శ్రీలంక కంటే వెనుకబడి ఉంది.

Advertisement

బంగ్లాదేశ్ ఫైనల్ కి వెళ్లే అవకాశం అస్సలు లేదు. సూపర్ ఫోర్ పాయింట్స్ టేబుల్ లో శ్రీలంక +0.420 పాకిస్తాన్ – 1.892 తో ఉన్నాయి. శ్రీలంక బంగ్లాదేశ్ తో గెలిచి ఫైనల్ లోకి వెళ్లొచ్చు. శ్రీలంక భారత్ ని ఓడించగలిగినట్లయితే ఆసియా కప్ ఫైనల్ కి శ్రీలంక చేరుకుంటుంది. అదే ఇండియా ని ఓడించలేకపోతే పాకిస్తాన్ కి ఫైనల్ కి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలా ఇప్పుడు పాకిస్తాన్ ఆసియా కప్ ఫైనల్ భారత్ చేతిలో ఉంది.

Also read:

Visitors Are Also Reading