Home » చంద్రబాబుని అక్రమ అరెస్టు చేసినవారికి పుట్టగతులు ఉండవు – అశ్విని దత్

చంద్రబాబుని అక్రమ అరెస్టు చేసినవారికి పుట్టగతులు ఉండవు – అశ్విని దత్

by Bunty
Ad

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నాలుగు రోజుల కిందట అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారిని ఏపీ సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. ఈ స్కామ్ లో 371 కోట్లు చంద్రబాబు ఆదేశాలతో మాయం అయినట్లు ఏపీ సిఐడి పోలీసులు… కేసు బుక్ చేశారు. ఇక ఈ కేసులో భాగంగా చంద్రబాబు నాయుడు ను ఫోటోలో ప్రవేశపెట్టగా… 14 రోజులపాటు చంద్రబాబు నాయుడు కు రిమాండ్ విధించింది కోర్టు.

Ashwini Dutt COMMENT ON JAGAN GOVT OVER CHANDRABABU ARREST

Ashwini Dutt COMMENT ON JAGAN GOVT OVER CHANDRABABU ARREST

దీంతో నారా చంద్రబాబు నాయుడును రాజమండ్రిలోని సెంట్రల్ జైల్లో ఉంచారు అధికారులు. ఇక అక్కడ చంద్రబాబు నాయుడు కు సకల వసతులు కల్పించింది ఏపీ ప్రభుత్వం. అయితే నారా చంద్రబాబు నాయుడును అరెస్టు చేయడంపై టాలీవుడ్ ప్రముఖులు అలాగే విపక్ష నేతలు… మమత బెనర్జీ సైతం స్పందించారు. చంద్రబాబు నాయుడు అరెస్టును తీవ్రంగా ఖండించారు. ఇలాంటి తరుణంలోనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆగస్టును తీవ్రంగా ఖండించారు టాలీవుడ్ ప్రముఖులు అశ్విని దత్.

Advertisement

Advertisement

దేశానికి గొప్ప ప్రధానిని, స్పీకర్ ను, రాష్ట్రపతిని ఇచ్చిన ఘనత చంద్రబాబుదని కొనియాడారు. అలాంటి వ్యక్తిని దుర్మార్గంగా అరెస్టు చేశారని జగన్ ప్రభుత్వం పై ఫైర్ అయ్యారు. మరికొన్ని నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో టిడిపి కచ్చితంగా గెలుస్తుందని…. అంతేకాదు 160 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు అశ్వనీ దత్. తర్వాత చంద్రబాబు అక్రమ అరెస్టుకు కుట్రపనిన వారికి పుట్టగతులు ఉండవని…. వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు అశ్విని దత్.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading