టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ వరుస సినిమాలతో ఇండస్ట్రీలో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈనగరానికి ఏమైంది, ఫలక్ నమా దాస్ లాంటి సినిమాలతో మంచి విజయాలు అందుకున్న విశ్వక్ సేన్ చివరగా పాగల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా అనుకున్నమేర విజయం సాధించలేదు. ఇక విశ్వక్ సేన్ ఇప్పడు అశోకవనంలో అర్జున కల్యాణం అంటూ డిఫరెంట్ లుక్ లో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేయగా ఆకట్టుకునే విధంగా ఉంది.
ASHOKAVANAMLO ARJUNA KALYANAM TEASER
ఇక ఈ సినిమాకు చింతా విజయ్ సాగర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రుక్సర్ దిలోన్ హీరోయిన్ గా నటించింది. ఇక తాజాగా విడుదల చేసిన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది. లేటు వయసులో పెళ్లి చేసుకుంటే వచ్చే కష్టాలను సినిమాలో చూపించబోతున్నట్టు కనిపిస్తోంది. టీజర్ లవ్ ఎమోషనల్ కామెడీ సీన్లతో ఎంతో ఆసక్తికరంగా ఉంది. విశ్వక్ సేన్ లుక్ కూడా ఏజ్ బార్ యువకుడిగా పొట్టబట్టతో అంతచాలను పెంచేస్తోంది. ఇక ఈ చిత్రం మార్చి 4 న విడుదల కాబోతున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.
ALSO READ : మెగాడాటర్ విడాకుల అంశంపై కొత్త అనుమానాలు…!