బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన మైథలాజికల్ మూవీ ఆది పురుష్. ఇందులో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా నటించారు. ఈ సినిమా జూన్ 16న భారీ అంచనాల మధ్య విడుదల అయింది. ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతుంది. తొలి మూడు రోజుల్లో రూ.340 కోట్లు వసూలు చేసింది. మరోవైపు ఈ మూవీపై కోర్టులో కేసులు, సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ ఇలా విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ సినిమా విడుదలై మూడు రోజులు అవుతున్న ఇప్పటికీ ఈ సినిమాకి సంబంధించిన చర్చలు ఏదో ఒకటి కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సినిమాలో చాలా సన్నివేశాలపై పాత్రల చిత్రీకరణ, సంభాషణలను వ్యతిరేకిస్తూ పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సినీ ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
ఈ చర్చలో భాగమయ్యారు అలనాటి రామాయణం ధారవాహిక రాముడి పాత్రధారి అరుణ్ గోవిల్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన పాల్గొని.. ఆదిపురుష్ సినిమా గురించి మాట్లాడారు. ఆది పురుష్ సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సినిమా టీజర్ విడుదలైనప్పుడు చిత్ర బృందానికి తాను కొన్ని సూచనలు సలహాలు కూడా ఇచ్చానని తెలిపారు. మన విశ్వాసానికి సంబంధించిన విషయము రామాయణం. దాని రూపాన్ని తారుమారు చేయడం ఆమోదయోగం కాదు. విజువల్ ఎఫెక్ట్స్ పక్కకు పెడితే.. పాత్రల చిత్రీకరణ చాలా ముఖ్యమైన విషయం. దానిని సీరియస్ తీసుకోవాలి. ఈ సినిమాని నేనింకా చూడలేదు కానీ సోషల్ మీడియాలో వస్తున్న వీడియోలను మాత్రం చూశాను.
Advertisement
రామాయణం మూవీలో ఇలాంటి భాషను నేను అసలు అంగీకరించాను. ఇన్నాళ్లుగా మనందరికీ తెలిసిన రామాయణ వర్ణనలో తప్పేముంది..? ఈ విషయాలు మార్చాల్సిన అవసరం ఏముంది..? బహుశా చిత్ర బృందానికి సీతారాములపై సరైన అవగాహన లేకపోవచ్చు ఏమో. అందుకే ఆది పురుష్ నిమాలో ఈ మార్పులు చేసినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈయన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గతంలో రామానంద్ సాగర్ తీసిన రామాయణం సీరియల్ లో అరుణ్ గోవిల్ రాముడు పాత్ర పోషించారు. ఇక ఆ సీరియల్ విశేష ఆదరణ సొంతం చేసుకుంది.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
రాకేష్ మాస్టర్ తిన్న ఫుడ్ లో విషం కలిపారా… ఊహించని రిపోర్ట్! అసలిందులో నిజమెంత?