Ad
వివాహ బంధం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అపురూపమైన ఘట్టం. చావు ఎలా ఉంటుందో, పుట్టుక ఏ విధంగా ఉంటుందో ఎవరిది వారికి తెలియదు. మనిషికి తెలిసి తనకు తాను స్వయంగా చేసుకునేది పెళ్లి మాత్రమే. తన కళ్ళ ముందు జరిగే ఆ ఘట్టాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా జరుపుకుంటారు. కొంతమంది పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంటే మరి కొంతమంది ప్రేమ వివాహం చేసుకుంటారు. ఏ వివాహమైన భార్యాభర్తల మధ్య అన్యోన్యమైన ప్రేమ ఉంటే కలకాలం హ్యాపీగా జీవించవచ్చు. కానీ ప్రస్తుత కాలంలో చిన్న చిన్న విషయాలకే మనస్పర్ధలు తెచ్చుకొని నిండు జీవితాలను పాడు చేసుకుంటున్నారు. అలాంటి ఈ సమాజంలో ఈ ఆర్మీ జవాన్ దంపతుల ప్రేమ మామూలుది కాదు. అందమైన ఈ జంటను చూస్తే విధికీ కన్ను కొట్టిందో ఏమో కానీ ఇద్దరిని బలి తీసుకుంది..
పూర్తి వివరాలు ఏంటో చూద్దామా.. పోలీసుల సమాచారం ప్రకారం ఆముదాలవలస మండలం ఈసర్ల పేట గ్రామానికి చెందిన 27 ఏళ్ల మంగరాజు రాజబాబు .. 2016 లో భారత సైన్యంలో చేరారు. గత సంవత్సరం వాళ్ల గ్రామానికి చెందిన మౌనికను యువతని పెళ్లి చేసుకున్నారు. ప్రజెంట్ ఆయన హర్యానాలో విధులు చేస్తున్నారు. మౌనిక ఏడు సంవత్సరాల ప్రెగ్నెంట్. ఈ తరుణంలో ఆమెకు హెల్త్ ఇష్యూస్ రావడంతో రాజబాబు తండ్రి సత్యనారాయణ ఆర్మీ ఆసుపత్రిలో చేర్పించారు. విషయం తెలిసిన వెంటనే సెలవు పై ఇంటికి వచ్చాడు రాజబాబు. భార్యను బ్రతికించుకునేందుకు సకల ప్రయత్నాలు చేశారు. కానీ పరిస్థితి విషమించి మౌనిక 16వ తేదీన మరణించింది.
ఆమె మరణాన్ని తట్టుకోలేని రాజబాబు సరిగ్గా ఆమె మరణాన్ని తట్టుకోలేని రాజబాబు సరిగ్గా ఆహారం తీసుకోకుండా అనారోగ్యం బారిన పడ్డాడు. ఈనెల 19న ఆసుపత్రిలో చేయించుకొని వస్తానని ఇంట్లో చెప్పి బయలుదేరారు. ఆహారం తీసుకోకుండా అనారోగ్యం బారిన పడ్డాడు. ఈనెల 19న ఆసుపత్రిలో చేయించుకొని వస్తానని ఇంట్లో చెప్పి బయలుదేరారు. ఆముదల వలసలో ట్రైన్ ఎక్కి పొందూరులో దిగి నేను చనిపోతున్నానని తన స్నేహితులకు సందేశం పంపాడు. వెంటనే ఆందోళన చెందినవారు పొందూరు పోలీసులకు సమాచారం అందించారు. కానీ ఆ మరునాడు పొందూరు లోని రైల్వే ట్రాక్ పై వెతికారు, చివరకు 11 గంటల సమయంలో కొంచాడా సమీపంలోని ఓ మామిడి తోటలో చెట్టుకు ఉరి వేసుకుని కనిపించాడు. వెంటనే అక్కడికి వెళ్లిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Advertisement