Home » జయలలిత మరణంపై ఆర్ముగస్వామి కమిటీ నివేదిక ఏం చెప్పిందంటే ?

జయలలిత మరణంపై ఆర్ముగస్వామి కమిటీ నివేదిక ఏం చెప్పిందంటే ?

by Anji
Ad

తమిళనాడు దివంగత మాజీ సీఎం జయలలిత మరణ రహస్యంపై ఆర్ముగస్వామి నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో ఈ నివేదికను బహిర్గతం చేసింది. జయలలిత మరణం సమయంలో శశికళను ఆమె దూరం పెట్టినట్టు నివేదికలో ఉంది. జయకు, శశికళకు మధ్య ఆ సమయంలో విభేదాలు ఉన్నట్టు వెల్లడించింది. జయలలిత మరణంలో శశికళ పాత్ర పై లోతైన దర్యాప్తు అవసరమని కమిటీ తమిళనాడు ప్రభుత్వానికి సూచించింది. జయలలితకు ట్రీట్ మెంట్ చేసిన డాక్టర్ల తీరును కూడా ఆర్ముగస్వామి కమిటీ తప్పు పట్టింది. అపోలో ఆసుపత్రి వర్గాలు సరైన సమాచారం ప్రజలకు ఇవ్వలేదని తెలిపింది. అప్పటి తమిళనాడు చీఫ్ సెక్రటరీ నేరానికి పాల్పడ్డారని వెల్లడించింది. జయలలితకు వెంటనే యాంటీయోప్లాస్టి చేయాలని నిపుణులు సూచించినప్పటికీ ఆ ట్రీట్ మెంట్ చేయలేదని కమిటీ తెలిపింది.

Advertisement

Advertisement

జయలలిత మరణం వెనుక అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు తమిళనాడు ప్రభుత్వం సెప్టెంబర్ 2017 లో మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ముగస్వామి నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఆర్ముగస్వామి కమిషన్ గత 5 సంవత్సరాలుగా వివిధ కోణాల్లో విచారించింది. జయలలిత సహచరులు , బంధువులు , అధికారులు , మాజీ మంత్రులతో మాట్లాడింది. ఆస్పత్రి వర్గాల నుంచి కూడా పలు వివరాలు తీసుకుంది. కమిటీ ప్రశ్నించిన 75 మంది సాక్షులలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు , చెన్నై అపోలో ఆసుపత్రి వైద్యులు , అప్పట్లో విధులలో ఉన్న చెన్నై పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారు. ఇలా 158 మందిని విచారించి కమిషన్ చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో జయలలితకు అందిన చికిత్సపై అనుమానాలు వ్యక్తం చేసింది.

Also Read :  పవన్ కళ్యాణ్ చెప్పిన వినలేదు ! గుడుంబా శంకర్ అందుకే ఫ్లాప్ అయ్యిందట..!

జయలలిత ఆసుపత్రి లో ఉన్న సమయం లో శశికళ పార్టీ నేతలతో సహా ఎవ్వరిని జయతో కలవనివ్వలేదు. ఈ నేపథ్యంలో పలు వదంతులు రావడంతో అపోలో ఆసుపత్రి , ఆమెకు చికిత్స అందించిన వైద్యులను కూడా విచారించారు. అయితే జయలలితకు అందించిన చికిత్సలో ఎలాంటి లోపాలు లేవని ఎయిమ్స్ వైద్య బృందం ఆర్ముగస్వామి కమిషన్ కు తెలిపింది. జయలలిత 2016లో అనారోగ్యంతో మరణించాక.. కమిషన్ ఏర్పాటు తర్వాత అనేక మలుపులు తిరిగింది.

Also Read :  పవన్ కళ్యాణ్ ని ఏపీ సీఎం గా చూడాలని ఉంది.. ఎన్టీఆర్ వ్యాఖ్యలు వైరల్

Visitors Are Also Reading