Home » అర్జున ఫాల్గుణ ఓటిటి విడుదలకు డేట్ ఫిక్స్…ఎప్పుడంటే..?

అర్జున ఫాల్గుణ ఓటిటి విడుదలకు డేట్ ఫిక్స్…ఎప్పుడంటే..?

by AJAY

డిఫరెంట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ అలరించే హీరో శ్రీ విష్ణు. ఈ టాలెంటెడ్ హీరో ఎక్కువగా నటనకు ప్రాముఖ్యత ఉన్న పాత్రలు ఎంచుకుంటారు అందుకే శ్రీ విష్ణు నటనకు ఎంతో మంది అభిమానులు కూడా ఉన్నారు. ముఖ్యంగా శ్రీ విష్ణు సినిమాలు నిజజీవితానికి దగ్గరగా ఉంటూ యువతరాన్ని ఆలోచనలో పడేలా చేస్తాయి. అలా శ్రీ విష్ణు నటించిన నీది నాది ఒకే కథ, బ్రోచేవారెవరురా మెంటల్ మదిలో సహా మరికొన్ని చిత్రాలు మంచి విజయం సాధించాయి.

arjuna falguna trailer out

arjuna falguna

ఇక రీసెంట్ గా శ్రీ విష్ణు అర్జున ఫాల్గున సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 31న ఈ సినిమా విడుదలైంది. తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా లో అమృత అయ్యర్ శ్రీ విష్ణుకు జోడీగా నటించింది. ఈ చిత్రాన్ని థియేటర్ లలో విడుదల చేయగా మిక్స్డ్ టాక్ వచ్చింది.

ArjunaPhalguna

అయితే తాజాగా ఈ సినిమా ఓటిటిలో విడుదల చేయనున్నారు. ప్రముఖ తెలుగు ఓటిటి ఆహా లో జనవరి 24 నుండి ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ విషయాన్ని తాజాగా ఆహా వెల్లడించింది. ఇక థియేటర్ లో ఈ సినిమా చెప్పుకోదగ్గ విజయం సాధించలేదు మరి ఓటిటి లో ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

ALSO READ :కొడుకుల పెళ్లిళ్ల‌ కోసం నాగార్జున బిగ్ ప్లాన్.. అఖిల్ కు ఆ అమ్మాయి ఫిక్స్..!

Visitors Are Also Reading