ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న క్రికెటర్ సచిన్ టెండూల్కర్. అయితే ఆయన కుమారుడు అర్జున్ కు మాత్రం అంతగా కలిసి రావడం లేదు. అయితే ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరపున ఆడిన సచిన్ ప్రస్తుతం ఆ జట్టుకే మెంటర్ గా ఉన్నాడు. ఇక అర్జున కూడా దాపుగా నాలుగేళ్ళ నుండి ఆ జట్టుతోం ట్రావెల్ అవుతున్నాడు. కానీ ఈ ఏడాది కూడా అతడికి నిరాశ తప్పలేదు.
Advertisement
అయితే గత ఏడాది ఐపీఎల్ 2021 కోసం జరిగిన వేలంలో మొదటిసారి పాల్గొన అర్జున్ ను 20 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్ జట్టు. కానీ అర్జున్ కు మాత్రం ఒక్క మ్యాచ్ లో కూడా అవకాశం ఇవ్వలేదు. ఇక ఈ ఏడాది ఐపీఎల్ 2022 కోసం జరిగిన మెగవేలంలోకి మళ్ళీ వచ్చిన అర్జున్ ను 30 లక్షలకు మళ్ళీ దకించుకుంది ముంబై జట్టు. ఇక ఈ సీజన్ ను టైటిల్ ఫెవరెట్ గా ప్రారంభించిన ముంబై మాత్రం అనుకున్న విధంగా రాణించలేదు. వరుసగా 8 మ్యాచ్ లలో ఓడిపోయిన ప్లే ఆఫ్స్ నుండి తప్పుకున్న మొదటి జట్టుగా నిలిచింది.
Advertisement
దాంతో అప్పటి జట్టులో అందరూ ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చింది ముంబై. అందువల్ల అర్జున్ కూడా ఈ ఏడాది ముంబై తరపున అరంగేట్రం చేస్తాడు అనుకున్నారు. జట్టు వరుస ఓటములు చూడడం వల్ల అర్జున్ ను ఆడిస్తుంది… ఈ మ్యాచ్ లో ఆడిస్తుంది ఆంటూ ముంబై ఆడే ప్రతి మ్యాచ్ కు ముందు ప్రచారం జరిగింది. ఇక ఈరోజు ఢిల్లీతో ఈ సీజన్ లో ఆఖరి మ్యాచ్ ఆడుతుండటంతో ఈ మ్యాచ్ లో అవకాశం వస్తుంది అనుకున్నారు. కానీ అర్జున్ మాత్రం తుది జట్టులో లేడు. దాంతో అభిమానులు ముంబై జట్టు పైన సీరియస్ అవుతున్నారు.
ఇవి కూడా చదవండి :
క్రికెటర్ భార్య పైన గవాస్కర్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్…!
పెళ్లి పీటలు ఎక్కబోతున్న దీపక్ చాహర్..!