Telugu News » Blog » పెళ్లి పీటలు ఎక్కబోతున్న దీపక్ చాహర్..!

పెళ్లి పీటలు ఎక్కబోతున్న దీపక్ చాహర్..!

by Manohar Reddy Mano
Ads

ఈ మధ్య కాలంలో భారత యువ క్రికెటర్ల పెళ్లిళ్లు చాలా వేగంగా జరుగుతున్నాయి. గత కరోనా లాక్ డౌన్ సమయంలో కనీసం అరడజను మంది ఆటగాళ్లు పెళ్లిళ్లు చేసుకున్నారు. మాములుగా పెళ్లి అంటే క్రికెట్ నుండి గ్యాప్ తీసుకొని చేసుకుంటారు ఆటగాళ్లు. కానీ భారత స్టార్ పేసర్ దీపక్ చాహర్ మాత్రం.. స్పెషల్ హా గ్యాప్ తీసుకోకుండా వచ్చిన గ్యాప్ లోనే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. దీపక్ తన ప్రియురాలు జయా భరద్వాజ్ ను వచ్చే నెల 1న పెళ్లి చేసుకోబోతున్నాడు.

అయితే జయా భరద్వాజ్, దీపక్ చాహర్ మంచి స్నేహితులు. కానీ గత ఏడాది ఐపీఎల్ 2021 లో భాగంగా పంజాబ్ తో జరిగిన మ్యాచ్ తర్వాత స్టేడియంలోనే అందరి ముందు… రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేసిన విషయం అందరికి తెలిసిందే. జయా ఎవరో కాదు. ఆమె బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ భరద్వాజ్ సోదరి. ప్రస్తుతం ఆమె ఓ కార్పోరేట్ కంపెనీలో ఉంద్యోగం చేస్తుంది. దీపక్ పెళ్లి గురించి తాజాగా అతని తండ్రి కేందర్ సింగ్ చాహర్ కీలక వ్యాఖ్యలు చేసాడు.

దీపక్-జయా ల పెళ్లికి ఇప్పటికే అన్ని పనులు పూర్తయ్యాయని… పెళ్లి పత్రికలు కూడా ప్రింట్ చేశామని వాటిని పంచమ ఒక్కటే ఇప్పుడు మిగిలుందని అన్నారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన దీపక్ పెళ్లి ఎక్కడ జరుగుతుందనేది మాత్రం తెలియడం లేదు. ఎందుకంటే గత లాక్ డౌన్ సమయంలో జరిగిన పెళ్లిళ్లలో దీపక్ తమ్ముడు రాహుల్ చాహర్ పెళ్లి గోవాలో జరిగింది. కాబట్టి ఇప్పుడు దీపక్ ఎక్కడ చేసుకుంటాడు అనేది తెలియదు. అయితే ఈ ఐపీఎల్ 2022 మెగవేలంలో 14 కోట్లకు చెన్నైకి అమ్ముడుపోయిన దీపక్ గాయం కారణంగా సీజన్ మొత్తానికి దూరం అయ్యాడు అంది తెలిసిందే.

ఇవి కూడా చదవండి :

SRH అందుకే ఈ సీజన్ లో ఓడిపోయింది.. వారు చేసిన పెద్ద తప్పు ఏంటంటే..?

సెహ్వాగ్ కు అక్తర్ వార్నింగ్.. ఎందుకంటే…?


You may also like