Telugu News » క్రికెటర్ భార్య పైన గవాస్కర్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్…!

క్రికెటర్ భార్య పైన గవాస్కర్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్…!

by Manohar Reddy Mano

భారత బ్యాటింగ్ దిగ్గజం.. టెస్టుల్లో టీం ఇండియా తరపున 10 వేల పరుగులు చేసిన మొట్టమొదటి బ్యాటర్ సునీల్ గవాస్కర్. అయితే తన టైం లో బ్యాట్ తో వార్తల్లో ఉండే గవాస్కర్ ఈ మధ్య మాటలు జారుతూ వార్తలో ఉంటున్నాడు. ప్రస్తుతం క్రికెట్ కామెంటేటర్ గా వ్యవరిస్తున్న గవాస్కర్ అప్పుడప్పుడు కొన్ని కామెంట్స్ చేస్తాడు. అవి కాస్త వైరల్ గా మారుతాయి. గతంలో ఓసారి విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ పై కామెంట్స్ చేసిన సన్నీ. అప్పుడు అనుష్క కూడా దీని పైన గట్టిగానే పంచ్ ఇచ్చింది. దాంతో అప్పటి నుబిడి సైలెంట్ అయిపోయాడు.

Ads

కానీ ఇప్పుడు మళ్ళీ నోరు జారీ మరో వివాదంలో చిక్కుకున్నాడు. దాంతో అభిమానులు మళ్ళీ సన్నీని టార్గెట్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ప్లే ఆఫ్స్ కు చేరుకున్న రాజస్థాన్ రాయల్స్ జట్టులో హిట్టర్ అయిన షిమ్రాన్ హెట్‌మెయర్‌ భార్య ఈ మధ్యే డెలివరీ అయిన విషయంలో తెలిసిందే. తన మొదటి సంతానం కోసం హెట్‌మెయర్‌ కూడా ఐపీఎల్ బయో బబుల్ బదిలి ఇంటికి వెళ్ళాడు. అక్కడ తన భార్య డెలివరీ అయిన తర్వాత పుట్టిన బిడ్డతో ఫోటోదిగి అభిమానులతో పంచుకున్నాడు,

ఆ వెంటనే మళ్ళీ అక్కడి నుండి ఇండియాకు ఐపీఎల్ కోసం వచ్చిన హెట్‌మెయర్‌ కరోనా నియమాల ప్రకారం క్వారంటైన్ లో గడిపి నిన్న చెన్నైతో జరిగిన మ్యాచ్ లో మళ్ళీ జట్టులోకి వచ్చి మ్యాచ్ ఆడాడు. అయితే ఈ మ్యాచ్ సమయంలో ‘హెట్మయర్ భార్య డెలివరీ అయ్యింది. మరి రాయల్స్‌కి అతను డెలివర్ చేస్తాడా…’ అంటూ కామెంటరీ బాక్సులో ఉన్న సునీల్ గవాస్కర్ చేసిన కామెంట్స్ చేసాడు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలే మరోసారి ఈ మాజీ దిగ్గజంను వివాదాల్లోకి నెట్టేశాయి. నువ్వు అలా ఎలా కామెంట్రీ చేస్తున్నావ్. అతడిని కామెంట్రీ ప్యాంనల్ నుండి తొలగించండి అని సోషల్ మీడియాలో బీసీసీఐకి సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

సెహ్వాగ్ కు అక్తర్ వార్నింగ్.. ఎందుకంటే…?

పెళ్లి పీటలు ఎక్కబోతున్న దీపక్ చాహర్..!


You may also like