సాధారణంగా చిన్న చిన్న గొడవలు వస్తే బంధాలు తెగిపోవు. అలా గొడవలు వచ్చినప్పుడు మనం ఎదుటి వారిపై వారు మన పై చూపించే వైఖరిని బట్టి మన బంధం యొక్క పటుత్వం ఆధారపడుతుంది. ఇద్దరి మధ్య గొడవలు వచ్చినప్పుడు అందులో ఒకరు నిర్లక్ష్యం చేసినప్పుడు చాలామంది అమ్మాయిలు ఎంతగానో ఏడుస్తారు. కొందరైతే బాధను తట్టుకోలేక డిప్రెషన్లోకి కూడా వెళ్తారు. అలాంటి సమయంలో మీరు ఏం చేయాలో ఒకసారి చూడండి..
also read:Astrology : ఈ రాశులు గల వారిని వివాహం చేసుకుంటే మీ దశ తిరిగినట్టే..!
Advertisement
మీరు కూడా పట్టించుకోకండి :
ఒకవేళ గొడవలు వచ్చి అబ్బాయి మిమ్మల్ని పట్టించుకోకుంటే మీరు కూడా అతన్ని పట్టించుకోకండి. ఇది కాస్త వెరైటీగా ఉన్నా కానీ నిజం.. మీరు ఆ విధంగా ఉండటం వల్ల నిజంగా ఇష్టపడితే వారికి వారే అర్థం చేసుకొని మళ్లీ తిరిగి వస్తారు. మీరు ఈ విధంగా ఉండటం వల్ల ఈమె సరదాకి అందరికీ పడిపోయే అమ్మాయి కాదు అని అర్థం చేసుకుంటాడు. అలా సవాలుగా ఉండే అమ్మాయిలంటే అబ్బాయిలు కూడా ఇష్టపడతారు. అతనికి మీపై మరింత గౌరవం కూడా పెరుగుతుంది. అలాంటప్పుడు మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి.
Advertisement
అద్దం ముందు నిల్చుని మీరు ఎలా కనిపిస్తున్నారో, మీ శరీరంలోని ఏ భాగాలు హైలెట్ అవుతున్నాయో గమనించండి. ముందు మీ మీద మీరు నమ్మకం ఉంచుకుంటే, ఎదుటి వారికి కూడా నమ్మకం కలుగుతుంది. ఇందులో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మిమ్మల్ని ఒకరు నిర్లక్ష్యం చేస్తున్నారు అంటే వారు కూడా మీ నుంచి నిర్లక్ష్యం పొందినట్టే కదా. కాబట్టి ధైర్యంగా ముందడుగు వేయండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఒకవేళ అతను మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నట్లు కనిపిస్తున్నా అది నిజంగా కాదేమో, అతను అలాగే ప్రవర్తిస్తాడేమో మిమ్మల్ని నిర్లక్ష్యం చేయకుండానే చేస్తున్నట్టుగా మీకు అనిపిస్తుందేమో మీకు అతని గురించి తెలియదు కాబట్టి మీకు అలా అనిపిస్తుందేమో కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి.
ముందుగా ఆ వ్యక్తిని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు అతన్ని కలవక ముందు ఏ విధంగా ఉండేవారు అదేవిధంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి. ఉదాహరణకు మీరు ప్రతిరోజు 12 గంటలకు భోజనం చేసే అలవాటు ఉంటే అది మర్చిపోకండి.. అతని కోసం ఎదురుచూస్తూ మీరు ఇబ్బందుల పాలవ్వకూడదు. వారి కోసం మీ అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి విషయాలను అబ్బాయిలు ఎక్కువగా ఇష్టపడతారు.
also read: