మన ఆరోగ్యం గురించి మన శరీరమే చెబుతుంటుంది.కానీ మనమే అంతగా పట్టించుకోం. మనకు కొన్ని సంకేతాలు ఇస్తూ అప్రమత్తంగా ఉండాలని దేహమే మనకు సూచనలిస్తుంది. మన పనిలో మనం ఉండి వాటిని గురించి అసలు పట్టించుకోం. ఇక సమయం మించి పోయిన తరువాత అయ్యే అంటే ఏం లాభం. మన శరీర వ్యవస్థలో ఎన్నో అవయవాలుంటాయి. ఇక అవన్నీ సక్రమంగా పని చేయాలంటే అన్నింటికీ సమాన స్థాయిలో మేత అందాలి. లేకుంటే అవి పాడైపోయి మన కథను ముగిస్తాయి.
అందుకోసం మన శరీరం విషయంపై నిత్యం మనం ఓ కన్ను వేస్తుండాలి. అప్పుడే మనకు ఏం జరుగుతుందనే దానిపై ఓ స్పష్టత రావడం ఖాయం. కొంత మందికి అయితే ఊరకే చెమటలు వస్తుంటాయి. మరికొందరూ ఏ చిన్న పని చేసినా చెమటలు విపరీతంగా వస్తుంటాయి. మరికొందరికీ చెమటలు పట్టవని.. చెమట పడితేనే ఆరోగ్యం అని అంటుంటారు. అయితే చెమట పట్టే వారికి ఆరోగ్యం బాగుంటుందని తెలిసినప్పటికీ ఎక్కువగా చెమటలు పట్టడం మాత్రం అనారోగ్య లక్షణమని చెబుతుంటారు. చెమటలు ఎక్కుగా పడితే కొంత మంది అధిక వేడి వల్ల పడుతాయని అంటుంటారు. కానీ చెమట అధికంగా వచ్చేవారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే.
చెమట ఎక్కువగా పట్టడం వల్ల వారి శరీరం దుర్వాస వస్తుంది. అదేవిధంగా వారికి గుండె కవాటాలు పని చేయకపోవడం వల్లనే అని వైద్యులు పేర్కొంటున్నారు. పలు రకాల రోగాలు కూడా చుట్టుముట్టే ప్రమాదం ఉంది. ఎముకల సంబందిత వ్యాధులు, ఎయిడ్స్ వంటి రోగాల బారిన పడే సూచనలు కనిపిస్తున్నాయి. అధిక చెమటలు పడితే చాలా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. చెమటలు ఎక్కువా పట్టేవారు ఉప్పు వాడకాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించాలి. విటమిన్లు, ప్రోటీన్లు ఉండే ఆహారం తీసుకోవాలి. తాజా పండ్లు, కూరగాయలు, వాల్ నట్స్ ఎక్కువగా తీసుకుంటే చెమట పట్టదు. అదేపనిగా ఎక్కువగా చెమట పడితే తక్షణమే డాక్టర్ ను సంప్రదించాలి. లేదంటే ఏవేవో రోగాలకు దారి తీసే ప్రాణపాయం కలిగే అవకాశాలున్నాయి. చెమట పట్టే బాధితులు జాగ్రత్తగా ఉండడం బెటర్. చెమటలు ఎక్కువగా పట్టేవారు మంచినీరు ఎక్కువ తాగాలి. వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి.
Also Read:
నేరేడు పండులోని ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే మీరు అస్సలు వదిలిపెట్టరు..!
హనిమూన్‌కి వెళ్లిన కొత్తజంట.. గదిలో భర్తకు షాక్ ఇచ్చిన భార్య..!