Home » మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారా..? డైట్ లో ఈ పదార్థాలను చేర్చుకోండి..!

మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారా..? డైట్ లో ఈ పదార్థాలను చేర్చుకోండి..!

by Anji
Ad

నేటి ఆధునిక యుగంలో మారుతున్న జీవన శైలిలో చాలా మంది తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. కొంత మంది పని ఒత్తిడి వల్ల ఈ సమస్యకి గురవుతుంటే.. మరికొందరూ కుటుంబ సమస్యల వల్ల పలు ఆందోళనల కారణంగా మానసిక ఒత్తిడి భారిన పడుతుంటారు. సమయానికి ఉద్యోగం రాలేదని, వయస్సు పెరుగుతున్నప్పటికీ ఇంకా పెళ్లి కావడం లేదని చాలా విషయాల్లో మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. ఒత్తిడి, ఆందోళనను అనుభవించినప్పుడు మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కొన్ని తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. కొన్ని హార్మోన్ల అసమతుల్యత కూడా ఒత్తిడిని కలిగిస్తాయి. ఒత్తిడికి గురైనప్పుడు కొన్ని రకాల ఆహారపదార్థాలను తీసుకోవడం ద్వారా కాస్త ఉపశమనం లభిస్తుంది. ఆ ఆహారపదార్థాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

పిండి పదార్థాలు :

Manam News

తృణధాన్యాల నుంచి వచ్చే కాంప్లెక్స్ పిండి పదార్థాలు రక్త ప్రవాహంలోకి వెళ్లి బలంగా ఉండడానికి సహాయపడుతాయి. త్వరగా మానసిక ఒత్తిడికి గురికాకుండా చూస్తాయి. పిండిపదార్థాలు మెదడులోని సెరోటోనిన్ అనే రసాయనాన్ని పెంచుతాయి. దీనిని హ్యాపీ హార్మోన్ పిలుస్తారు. రోజు తీసుకునే ఆహారంలో ఓట్స్, గోదుమలు, క్వినోవా, బార్లీ లేదా ఇతర తృణధాన్యాలు ఉండేవిధంగా చూసుకోవాలి.

సిట్రస్ పండ్లు :

Manam News

సిట్రస్ జాతి పండ్లలో ఉండే విటమిన్ సి ధనిక వనరులు ఒత్తిడిని నియంత్రించడంలో సహాయపడుతుంది. విటమిన్ సి పెరిగిన కార్టిసాల్ స్థాయిలను కూడా నివారిస్తాయి. కార్టిసాల్ అనేది ఫ్లైట్ లేదా ఫైట్ హార్మోన్. ఈ హార్మోన్ ఒత్తిడి, దీర్ఘకాలిక పెరుగుదల అనేక ఆరోగ్య పరిస్థితులతో ముడిపడి ఉన్నప్పుడు విడుదలవుతుంది. 

ఆకుకూరలు :

చలికాలంలో ఆకుకూరలు తినొచ్చా? | Manalokam

Advertisement

ఆకుకూరల్లో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. ఈ మెగ్నీషియం మెదడు పని తీరును తగ్గించి ఆందోళనను తగ్గిస్తుంది. బచ్చలికూర, తోటకూర వంటి రకరకాల ఆకుకూరల్లో మెగ్నిషియం పుష్కలంగా లభిస్తుంది. అదేవిధంగా అవకాడోస్, బీన్స్, అరటిపండ్లు తీసుకోవడం వల్ల కూడా ఒత్తిడిని నియంత్రించుకోవచ్చు. 

జింక్ రిచ్ ఫుడ్స్ :

Manam News

మన శరీర ఒత్తిడిని ఎదుర్కోవడానికి జింక్ సహాయపడుతుంది. జింక్ ఆరోగ్యకరమైన నాడి వ్యవస్థకు కీలకమైంది. జింక్ ప్రధానంగా జీడిపప్పు, పౌల్ట్రీ, గుడ్లలో లభిస్తుంది. మన శరీరంలో మిగిలిన భాగాలకు మెదడును కలిపే ఆరోగ్యకరమైన వాగస్ నాడీ. మన నరాలు ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉండడానికి జింక్ కలిగిన ఆహార పదార్థాలను ప్రతిరోజూ తీసుకోవాలి. 

ఒమెగా 3 ఎక్కువగా ఉండేవిధంగా.. 

Omega -3: ఈ ఐదు రకాల పదార్థాలలో ఒమేగా-3 అధికం.. ఆ విషయాలలో అద్భుతమైన  ఫలితాలు..! | These five types of ingredients are high in omega 3 ..  Excellent results | TV9 Telugu

ఒమెగా-3 కొవ్వులు ఆక్సీకరణ ఒత్తిడిని మెరుగుపరచడానికి అదేవిధంగా మెదడును చురుకుగా ఉండేవిధంగా ఒత్తిడిని నియంత్రిస్తుంది. ప్రధానంగా కొవ్వు చేపలు, అక్రోట్లను, అవిసె గింజలు తీసుకోవడం వల్ల శరీరానికి శక్తి అందించడం కాకుండా ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. 

Also Read :  చలికాలంలో పిల్లల సంరక్షణకు అద్భుతమైన చిట్కాలు ఇవే..!

పసుపు :

Health Benefits With Turmeric: పసుపుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు... | Health  Benefits with Turmeric By Taking Daily

పసుపులో బయోయాక్టివ్ సమ్మెళనం, కర్కుమిన్ ఉంది. అధికంగా ఉంటుంది. పూర్వం నుంచి పసుపును చికిత్సకు వినియోగిస్తుంటారు. ఇందులో హార్మోన్ సెరోటోనిన్, డోపామైన్లను పెంచుతుంది. అదేవిధంగా యాంటిడిప్రెసెంట్ మందు మాదిరిగా పని చేస్తుందని చెబుతుంటారు. ఒత్తిడిని ఎదుర్కోవడానికి పసుపు టీ తీసుకోవడం చాలా ఉత్తమం. 

Also Read :  ఈ విషయాలు తెలిస్తే ఆవాల ఆకులను అస్సలు వదిలిపెట్టరు..!

Visitors Are Also Reading