Home » చలికాలంలో పిల్లల సంరక్షణకు అద్భుతమైన చిట్కాలు ఇవే..!

చలికాలంలో పిల్లల సంరక్షణకు అద్భుతమైన చిట్కాలు ఇవే..!

by Anji
Published: Last Updated on

సాధారణంగా చలికాలంలో చిన్న పెద్ద తేడా లేకుండా జలుబు, దగ్గు, న్యుమేనియా, ఆస్తమా, శ్వాస సమస్యలు, జ్వరం, చెవి ఇన్ఫెక్షన్ల, కడుపునొప్పులతో సహా పలు వ్యాధులకు గురవుతుంటారు. ఇంకా అందులో చిన్నపిల్లలయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తల్లిదండ్రులు ఎంత జాగ్రత పడినప్పటికీ పిల్లలకు ముక్కుకారడం మాత్రం తప్పడం లేదు. పిల్లలు డాక్టర్ చెప్పిన సూచనలు పాటిస్తున్నారా లేదా అని చూడడం తల్లిదండ్రులకు పెద్ద తలనొప్పిగా ఉంటుంది. మీ బిడ్డను ఎలా చూసుకోవాలో ఇప్పుడు మనం కొన్ని చిట్కాలను తెలుసుకుందాం. 

సాధారణ జలుబు, ఫ్లూ వంటి వాటికి  కూడా వైద్యుడి సహాయంతో మాత్రమే చికిత్స చేయాలి. డాక్టర్ తో మాట్లాడకుండా పిల్లలకు మాత్రలు అస్సలు ఇవ్వకూడదు. మెడిసిన్ ఎక్కువగా వాడడం వల్ల రోగ నిరోధక శక్తి తగ్గుతుంది.  మెడిసిన్ చాలా తక్కువగా వినియోగించడం బెటర్. 

చల్లని నీరు తాగడం మానేయాలి  :

Manam News

పిల్లలు చలికాలంలో కూడా చల్లని నీటినే తాగడానికి వినియోగిస్తారు. చల్లని నీటిని తాగడంతో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వస్తుంది. దీంతో దగ్గు, జలుబు వచ్చే అవకాశముంది. అందుకోసం పిల్లలకు వేడి నీరు ఇవ్వడం చాలా బెటర్. శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడంతో శరీరంలోని టాక్సిన్ లను బయటికి పంపుతుంది. 

వేయించిన ఆహారాన్నితగ్గించండి :

Manam News

చాలా మంది పిల్లలు ఫ్రెంచ్ ఫ్రైస్, పాస్తా, బర్గర్ వంటి జంక్ ఫుడ్ తింటారు. జంక్ ఫుడ్స్ మానేసి పిల్లలకు పౌష్టికాహారం ఇచ్చేలా జాగ్రత్తపడాలి. ఆహారంలో పండ్లు, కూరగాయలను చేర్చండి. ప్రోటీన్, ఐరన్, జింక్ వంటి ముఖ్యమైన పోషకాలు పిల్లల్లో రోగ నిరోధకశక్తిని పెంచడంలో సహాయపడుతాయి.  

Also Read :   pawan kalyan kushi: పవన్ కళ్యాణ్ ఖుషి మూవీ మళ్లీ విడుదల..కానీ డైరెక్టర్ అలా అన్నారేంటీ..?

వ్యాయామం :

Manam News

పిల్లలు ఆడుకోవడానికి బయటికి వెళ్తుంటారు. వారిని సూర్యకాంతిలో ఆడనివ్వండి. రెగ్యులర్ వ్యాయామం పిల్లల పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుతుంది. 

Also Read :   వాల్తేరు వీరయ్యలో రవితేజ పాత్ర నిడివి ఎంతో తెలుసా ?

Visitors Are Also Reading