ఎక్కువ సమయం కంప్యూటర్ ముందు కూర్చొని గడిపే వారు శారీరక శ్రమపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా శారీరక శ్రమ లేకుండా రోజుకు ఎనిమిది గంటల కన్నా ఎక్కువ సేపు కూర్చునే కార్మికులు లేదా ఉద్యోగులు ఊబకాయం వంటి సమస్యలను ఎదుర్కొంటారని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం కరోనా పుణ్యమా అని చాలా మంది ఇంట్లో ఉండే ఆఫీస్ పని చేస్తున్నారు. అయితే ఒకే దగ్గర ఇలా కూర్చొని చేయడం ద్వారా అనేక రకాల వ్యాధులు వచ్చే అవకాశముంది. ఇలా జరుగకుండా ఉండాలంటే ప్రతీరోజు వ్యాయామం చేయడం చాలా అవసరం. వ్యాయామం కోసం సమయాన్ని కేటాయించడం కూడా ముఖ్యమే. లేనియెడల శరీరం బలహీనంగా మారుతుంది.
ఎవ్వరైనా ప్రతి రోజు చాలా ఉత్సాహంగా ఉండాలంటే మాత్రం వ్యాయామం శరీరానికి చాలా అవసరం. శారీరక ఆరోగ్యం స్వభావాన్ని కొన్ని లక్షణాలతో అంచనా వేయవచ్చు ఆఫీస్‌కి వెళ్లేవారు మెట్లు ఎక్కే ముందు ఊపిరి పీల్చుకోవడానికీ ఇబ్బందిగా అనిపిస్తే వెంటనే గమనించాలి. ఇక అంతే కాదు.. సీటుకు వెళ్లే ముందు అలిసిపోయినట్టు అనిపిస్తే అప్రమత్తంగా ఉండడం బెటర్. శారీరక బలహీనతకు ఇదిసంకేతమని చెప్పాలి. మీరు కంప్యూటర్ ముందు కూర్చోవడానికి ముందే ప్రతీరోజు వ్యాయామం కోసం కొంచెం సమయం కేటాయించండి. చాలా మందికి ఉదయం పని ముగించుకుని ఆఫీస్‌కి వెళ్లే ఉత్సాహం ఉండదు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : ముల్తానీ మట్టి చర్మానికి ఓ వరం.. ప్రయోజనాలు తెలిస్తే వదలరు..!
ఇక ఇంటికి చేరుకునే సరికి అలిసిపోయే ఉంటారు. ఇంటికి వెళ్లాక తినడానికి కూడా ఇష్టం లేకుండా నిద్ర పోవాల్సి వస్తుంది. రోజు అంతా తన పని ప్రదేశం నుంచి కదలేకంటే పని చేయడమే దీనికి ప్రధాన కారణం అని చెప్పాలి. ఇక ఎక్కువ సేపు కంప్యూటర్ ముందు కూర్చోవడం వల్ల శక్తి ఆదా కాదు.. అంతేకాదు శారీరకంగా పని లేకపోవడంతో మానసికంగా ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. కనీసం గంటకొకసారి అయినా లేచి కొన్ని నిమిషాల పాటు తిరగడం మంచిది. ఎక్కువ సేపు అలాగే కూర్చునే వ్యక్తులు కండరాల కదలికలు బలహీన పడవచ్చు. శారీరక శ్రమ లేకపోవడంతో కండరాలు బలహీనంగా మారుతాయి. కండరాలు శరీరాన్ని ప్రతి చోటా తీసుకువెళ్తాయి. కండరాలు చాలా దృఢంగా లేకుంటే శరీరం బలహీనంగా మారుతుంది. ప్రారంభ లక్షణం అలసట. అప్పుడు మీరు వివిధ వ్యాధులను ఎదుర్కొంటారు. కండరాలకు తగిన శిక్షణ ఇవ్వడం చాలా అవసరం. అందుకోసం ఉదయం లేదా సాయంత్రం వ్యాయామం చేయడం చాలా ముఖ్యమని వైద్యులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి : భూమా మౌనికతో రెండో పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చిన మనోజ్..!