Home » బంగారం తాకట్టు పెడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..!!

బంగారం తాకట్టు పెడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

సాధారణంగా మధ్యతరగతి కుటుంబాల్లో డబ్బులు అవసరం అయినప్పుడు వారు ముందుగా చేసే పని నగలు తాకట్టు పెట్టడం.. అయితే ఈ నగలను బయట మార్వాడి కొట్టు లో కుదువ పెడితే వడ్డీల మీద వడ్డీ వేస్తారు. కాబట్టి చాలామంది ప్రస్తుతం ప్రభుత్వ బ్యాంకుల్లో 60 నుంచి 80 పైసలు వడ్డీ ఉంటుంది కాబట్టి అందులోనే ఎక్కువగా నగల తాకట్టు పెడుతున్నారు. ఇదే అదునుగా చేసుకున్న కొంతమంది కేటుగాళ్లు పేద వాళ్ళని ముంచుతూ మోసాలకు పాల్పడుతున్నారు. వారి చేతివాటం చూపించి దొంగ బుద్ధి బయటపెట్టుకున్నారు. తాజాగా ఏపీ లోని పల్నాడు జిల్లాలో ఒక సంఘటన జరిగింది. రాజు వారి పాలెం మండలంలోని ఆకుల గణపవరంలో ఒక జాతీయ గ్రామీణ బ్యాంకు ఉంది. అయితే అదే గ్రామానికి చెందినటువంటి ఒక వ్యక్తి ఆ జాతీయ బ్యాంకుల్లో గత ఏడాది జనవరిలో బంగారాన్ని తాకట్టు పెట్టి లోన్ తీసుకున్నాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం బ్యాంకుకు వడ్డీతో సహ అప్పు మొత్తం తీర్చేశాడు. ఈక్రమంలో మధ్యాహ్నం వచ్చి నగలు తీసుకెళ్ళమని బ్యాంక్ అధికారులు చెప్పారు. దీంతో మధ్యాహ్న సమయంలో వచ్చాడు. కానీ రాత్రి 8 గంటల వరకు ఆయన అక్కడే కూర్చోబెట్టుకొని నగలు మాత్రం ఇవ్వలేదు. దీంతో ఆగ్రహానికి గురైన యువకుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు చివరికి బ్యాంకులో క్లర్క్ వచ్చి నీ బంగారం మిస్ అయిందని అంగీకరించాడు. దీంతో బ్యాంకు స్ట్రాంగ్ రూమ్ లో ఉన్నటువంటి నగలు ఎలా మాయమయ్యాయి అనేది మిస్టరీగా మారింది. దీన్ని ఇంటి దొంగలే మాయం చేశారా.. లేదంటే నిజంగానే దొంగలు పడ్డారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాబట్టి బ్యాంకులో తాకట్టు పెట్టే ముందు కాస్త ఆచితూచి పెట్టాలని కొంతమంది అంటున్నారు.

Advertisement

ALSO READ;

Advertisement

ఆంబోతుకు, ఎద్దుకు మధ్య తేడా.. అచ్చోసిన ఆంబోతు అంటే ఇదేనా..!!

గోవాలో హిందువులు రెండు పెళ్లిళ్లు ఎందుకు చేసుకుంటారో తెలుసా..!!

 

Visitors Are Also Reading