Home » గోవాలో హిందువులు రెండు పెళ్లిళ్లు ఎందుకు చేసుకుంటారో తెలుసా..!!

గోవాలో హిందువులు రెండు పెళ్లిళ్లు ఎందుకు చేసుకుంటారో తెలుసా..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రస్తుతం భారత దేశంలో అమలులో ఉన్న చట్టం ప్రకారం హిందువులు రెండు వివాహాలు చేసుకొని ఇద్దరు భార్యలను కలిగి ఉండరాదు. ఒకవేళ రెండో వివాహం చేసుకోవాలంటే మొదటి భార్య నుంచి విడాకులు తీసుకోవాల్సి ఉంటుంది.. ఒక భార్య ఉండగా మరొక భార్యను పెళ్లి చేసుకోవడం నేరంగా భావిస్తారు.. అలా చేస్తే కేసుతో పాటుగా జైలుకు వెళ్తారు. అయితే హిందూ వివాహ చట్టం ప్రకారం చూస్తే 1955 రెండవ పెళ్లి చట్టబద్ధంగా చెల్లుబాటు కాదు. అయితే ముస్లిం మతం లో మాత్రం ఒక వ్యక్తి నాలుగు వివాహాలు చేసుకోవడానికి అనుమతి ఉంటుంది. వారు నలుగురు భార్యలను కూడా కలిగి ఉండవచ్చు. అయితే గోవాలో దీనికి విరుద్ధంగా ఉంది. ఆజ్ తక్ అనేటువంటి నివేదిక ప్రకారం చూస్తే 1880లో గోవా సివిల్ కోడ్ లో సవరణ జరిగినది. ఆనాటి పోర్చుగీస్ రాజు కొన్ని షరతులతో ఈ హక్కులు కల్పించారు. అయితే కొన్ని పరిస్థితుల్లో మాత్రమే గోవాలోని హిందువులు ఒక భార్య ఉండగా మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు.అది ఎలా అంటే వివాహమై 25 సంవత్సరాలు అయినా పిల్లలు కాకపోతే ఆ పురుషుడు మరొక వివాహాన్ని చేసుకోవచ్చు. అది కూడా మొదటిభార్య అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ఆమెతో రాతపూర్వకంగా రాయించుకుంటే ఆ వివాహం చెల్లుబాటు అవుతుంది. కానీ ఇప్పటివరకు గోవాలో ఇలాంటి వివాహం ఎక్కడా జరగలేదు అని చెప్పవచ్చు.

Advertisement

ALSO READ;

Advertisement

నా అనుకున్న వాళ్లచేతిలోనే దారుణంగా మోసపోయి రొడ్డునపడ్డ స్టార్ హీరోయిన్ లు….!

మహేష్ బాబు ఆస్తుల విలువ ఎన్ని మిలియన్ డాలర్లో తెలుసా…ఒక్క విల్లాకే…!

 

 

Visitors Are Also Reading