టమోటాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు జరుగుతుంది. ఇది మాత్రమే కాదు.. టమాటాలను అనేక చర్మ సంరక్షణ సౌందర్య ఉత్పత్తులతో కూడా ఉపయోగిస్తారు. టమోటాలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మానికి రోగ నిరోధక శక్తికి చాలా అవసరం. టమోటాలు ఎక్కువగా తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
టమాటాలను అధికంగా తీసుకోవడం వల్ల పొట్ట సంబంధిత రుగ్మతలు వస్తాయి. అదేవిధంగా యాసిడ్ రిఫ్లక్స్ కి సహాయపడే మాలిక్ యాసిడ్ అండ్ సిట్రిక్ యాసిడ్ లను కలిగి ఉంటాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండెల్లో మంట వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. టమోటాలకు అలెర్జీని కలిగి ఉంటే.. దద్దుర్లు వంటి చర్మ అలెర్జీ లక్షణాలను కలిగిస్తుంది.
Advertisement
Also Read : గుండె జబ్బులు రాకుండా వెల్లుల్లి, నిమ్మకాయతో ఇలా చేస్తే అద్భుతమైన ఫలితం పక్కా..!
టమాటాలను అధికంగా తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు, వాపులు వస్తాయి. ఆర్థరైటిస్ బాధితులకు చాలా తీవ్రంగా ఉంటుంది. అదేవిధంగా కడుపునొప్పి, చిరాకు వంటి జీర్ణక్రియకు సంబంధించిన కొన్ని ఇతర లక్షణాలు కూడా కనిపించవచ్చు. టమాటాలను అధికంగా తీసుకోవడం వల్ల కిడ్నీలకు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. టమాటాలు కిడ్నీలలో రాళ్లకు దారి తీస్తాయి. అందుకే కిడ్నీ సమస్య ఉన్న వారిని టమాటాలను తినకూడదని డాక్టర్లు సూచిస్తుంటారు. అందుకే టమాటాలను జాగ్రత్తగా వాడటం చాలా ఉత్తమం.
Also Read : వేసవిలో వేడిని తగ్గించి మీ ఆరోగ్యాన్ని కాపాడే రసాలు ఇవే..!